
పంత్ పిచ్చి కొట్టుడు..
టెస్టులను టీ20ల్లా ఆడే రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లో కూడా మరోసారి తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. పుజారా అవుటైన తర్వాత అయ్యర్‌ను కాదని పంత్‌ను ఐదో స్థానంలో దింపింది టీమిండియా. ఈ ప్రయోగం జట్టుకు బాగానే కలిసొచ్చింది. ఆరంభంలో కొంత నెమ్మదిగా ఆడిన పంత్.. కుదురుకునే కొద్దీ రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 104 బంతులు ఎదుర్కొన్న అతను ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. సెంచరీకి అడుగు దూరంలో పెవిలియన్ చేరాడు. మెహదీ హసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

శ్రేయాస్ కూడా..
జట్టులో రెగ్యులర్ స్థానాన్ని దాదాపు కన్ఫర్మ్ చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా పంత్‌ను ఫాలో అయిపోయాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. వీళ్లిద్దరి జోడీ ధనాధన్ ఆటతో భారత జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 105 బంతులు ఎదుర్కొన్న అతను.. పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. కానీ పంత్‌లాగే సెంచరీ మాత్రం పూర్తి చేసుకోలేకపోయాడు. పంత్ అవుటైన కాసేపటికే షకీబల్ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

అదే పిచ్‌పై ఆడారా?
పంత్, శ్రేయాస్ ఆడిన విధానం చూసిన అభిమానులు నోరెళ్లబెట్టారు. అంతకుముందు రాహుల్, గిల్, పుజారా, కోహ్లీ అందరూ ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి కష్టపడ్డారు. బౌలర్లకు కూడా పిచ్ నుంచి మంచి సహకారం లభించింది. అలాంటి పిచ్‌పై వీళ్లిద్దరూ దంచి కొట్టడంతో వీళ్ల కోసం ప్రత్యేకంగా కొత్త పిచ్ వేశారా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. టాపార్డర్ కూడా ఇలాగే ఆడి ఉంటే బంగ్లా ముందు భారీ లక్ష్యం నిలిచేదని అంటున్నారు. టాపార్డర్‌పై మండి పడుతున్నారు. వీళ్లిద్దరూ రాణించడంతో రెండో రోజున భారత జట్టు 314 పరుగులకు ఆలౌట్ అయింది.


Click it and Unblock the Notifications