Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదరగొట్టాడుగా!: బ్లాక్ ఫాంథర్‌లో పాండ్యా నటనకు నెటిజన్లు ఫిదా

Hardik Pandya

హైదరాబాద్: సఫారీ పర్యటనలో ఎప్పుడో తొలి టెస్టులో మెరిసిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆ తర్వాత వరుసగా వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడు. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్నా... సినిమాల్లో మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాడు.

అయితే పాండ్యా క్రికెట్ మానేసి.. సినిమాలవైపు ఎప్పుడు వెళ్లాడా? అని అనుకుంటున్నారా? అదేం లేదండి బాబూ... పాండ్యా సఫారీ పర్యటనలోనే ఉన్నాడు. అయితే అచ్చం పాండ్యాలాగే ఉన్న కిల్మోంగర్ నటించిన హాలీవుడ్ సినిమా బ్లాక్ పాంథర్‌ తాజాగా విడుదలైంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కిల్మోంగర్... టీమిండియా క్రికెటర్ పాండ్యాను పోలి ఉన్నాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు కలెక్షన్లను రాబడుతోంది. అంతేకాదు ఆ సినిమాలో కిల్మోంగర్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

విడుదలైన ఐదు రోజుల్లో నార్త్ అమెరికాలో $263 మిలియన్లు సంపాదించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సాధించిన $462.2 కలెక్షన్లను చూసి సినీ విమర్శకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అచ్చం కిల్మోంగర్‌ను పోలి ఉన్న పాండ్యాకు లింక్ పెట్టి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.

'పాండ్యా నువ్వు అదుర్స్' అని ఒకరు ట్వీట్ చేయగా మరొక నెటిజన్ 'హాలీవుడ్ మూవీలను నేను పెద్దగా చూడను.. కానీ బ్లాక్ పాంథర్‌లో హార్దిక్ నటన మాత్రం అద్భుతం' అంటూ ట్వీట్ చేశారు. హెయిర్ స్టైల్, హావభావాలు, లుక్స్ సినిమాకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

Story first published: Friday, February 23, 2018, 18:25 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+