
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తడబడుతోంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు చాలా ఇబ్బంది పడింది. అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న పిచ్‌పై మంచి స్కోరు చేయడానికి టీమిండియా బ్యాటర్లు చాలా కష్టపడ్డారు. అయితే ఒక్కరంటే ఒక్క భారత బ్యాటర్ కూడా భారీ స్కోరు చెయ్యలేదు. అతి కష్టం మీద 22 పరుగులు చేసిన కోహ్లీనే భారత్‌లో టాప్ స్కోరర్ అంటేన టీమిండియా ఎంతలా తడబడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఆసీస్‌కు చుక్కలు చూపించాడు.
చివరల్లో బ్యాటుతో చెలరేగిన ఉమేష్ ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసీస్ బౌలర్లపై టీ20 తరహాలో విరుచుకుపడిన ఉమాష్ తన ఆర్క్‌లో బంతి పడితే మాత్రం దాన్ని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కేవలం 16 పరుగులు మాత్రమే చేసిన అతను కోహ్లీ రికార్డును సమం చేశాడు. తన కెరీర్‌లో 107 టెస్టులు ఆడిన విరాట్.. తన కెరీర్‌లో మొత్తం 24 సిక్సర్లు మాత్రమే బాదాడు. అతను ఎక్కువగా బౌండరీలపైనే ఫోకస్ పెడతాడన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విరాట్ కోహ్లీ రికార్డును ఉమేష్ సమం చేశాడు. ఇండోర్ టెస్టులో రెండు భారీ సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీని సమం చేశాడు. ఇప్పపటి వరకు తన కెరీర్‌లో కేవలం 55 టెస్టులో ఆడిన ఉమేష్ 24 సిక్సర్లు బాదాడు. కోహ్లీ కూడా మొత్తం 107 మ్యాచుల్లో 24 సిక్సర్లు మాత్రమే బాదాడు. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఉమేష్ ఆటతీరును తెగ మెచ్చుకుంటున్నారు. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టినందుకు చాలా సంతోషిస్తున్నారు.