Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక ఇంటి వాడైన సర్ఫరాజ్ ఖాన్.. కాశ్మీర్ అమ్మాయితో వివాహం!

దేశవాళీల్లో అద్భుంగా రాణిస్తూ టీమిండియా నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఒక ఇంటి వాడయ్యాడు. అతను తాజాగా జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ కొత్త జంటపై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్‌కు ఇప్పటి వరకు భారత జట్టులో చోటు దక్కలేదు. వెస్టిండీస్ టూర్‌లో అతనికి కచ్చితంగా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు సెలెక్టర్లు మాత్రం అతనికి మొండి చెయ్యే చూపారు. దీనిపై పలువురు మాజీ దిగ్గజాలు కూడా మండిపడ్డారు.

Fans happy as Sarfaraz Khan gets married

ఇటీవల ముగిసిన దియోధర్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. తన ఆటతీరు బాగలేని కారణంగానే జట్టుకు ఎంపిక కావడం లేదని అనుకున్నాడు. అయితే అతని ప్రవర్తన, ఫిట్‌నెస్ తమకు నచ్చలేదని, అందుకే అతనికి జట్టులో అవకాశం దక్కడం లేదని బీసీసీఐ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ అందరూ మండిపడ్డారు. ఆటగాడు పరుగులు చేస్తున్నాడా? లేదా? అని మాత్రమే చూడాలి కానీ.. ఇలాంటి చెత్త కారణాలు చెప్పకూడదని అన్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ పెళ్లి వార్త నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన అమ్మాయిని సర్ఫరాజ్ ఖాన్ పెళ్లాడాడు. ఇలా కాశ్మీర్ అమ్మాయిని పెళ్లాడటం తన డెస్టినీ అని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు.

అలాగే అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత జెర్సీలో కనిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అది జరగాలని రాసి ఉంటే.. ఎవరూ ఆపలేరని అభిప్రాయపడ్డాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. సర్ఫరాజ్ జీవితలో ఇది మంచి శుభపరిణామం అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ పెళ్లితో అయినా సర్ఫరాజ్ రాత మారి భారత్‌లో అడుగు పెడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Monday, August 7, 2023, 10:05 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+