
నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. స్పిన్‌కు సహకారం అందిస్తున్న పిచ్‌పై తనదైన స్టైల్‌లో వేగంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హాఫ్ సెంచరీ సాధించిన అతను.. రెండో రోజు కూడా ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే అవతలి ఎండ్‌లో అతనికి సహకరించే బ్యాటర్లు కరువయ్యారు.
రెండో రోజు ఆట ఆరంభమైన తర్వాత అశ్విన్ (23)తో కలిసి కాసేపు చక్కగా ఆడాడు రోహిత్. అశ్విన్ అవుటైన తర్వాత ఛటేశ్వర్ పుజారా (7) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. లంచ్ తర్వాత తొలి బంతికే కోహ్లీ (12) కూడా అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ (8) పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే మరో ఎండ్‌లో రోహిత్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు.
ఈ క్రమంలోనే బౌండరీతో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో స్వదేశంలో టెస్టుల్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లు తడబడుతున్నా తను మాత్రం ధాటిగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ టెస్టు సిరీస్‌లో భారత్ గెలిస్తేనే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి మ్యాచ్‌లో పట్టుదలగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్తున్న కెప్టెన్‌ను ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
హిట్ మ్యాన్ అంటే ఇదే కదా.. కష్టమైన పిచ్‌పై కూడా జట్టును గెలిపిస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన బ్యాటర్ అతనే అని మెచ్చుకుంటున్నారు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో రోహిత్ చాలా సక్సెస్ అయ్యాడు. ఈ జాబితాలో మురళీ విజయ్ తర్వాత రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. మరి అతను ఈ సెంచరీని డబుల్ సెంచరీగా మలుస్తాడేమో చూడాలి.