
అక్షర్ ఒంటరి పోరాటం..
ఛేజింగ్‌లో భారత టాపార్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠీ కూడా రాణించలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. కానీ అతనికి సహకారం అందించే వాళ్లు కూడా కరువయ్యారు. ఇలాంటి సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 31 బంతులు ఎదుర్కొన్న అతను 65 పరుగులతో దాదాపు మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు.

చెలరేగినా ఫలితం లేకపోయింది..
కానీ చివరకు అతని ధనా ధన్ ఇన్నింగ్స్ వృధా అయింది. అక్షర్ మాత్రమే కాదు యువ పేసర్ శివమ్ మావి కూడా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అయితే అక్షర్ ఇన్నింగ్స్ మాత్రం భారత ఛేజ్‌కే హైలైట్‌గా నిలిచింది. శ్రీలంక టాప్ స్పిన్నర్ వానిందు హసరంగ వేసిన 14వ ఓవర్లో అయితే అక్షర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. అతను క్రీజులో ఉండగా శ్రీలంక గెలవడం అసాధ్యంగా కనిపించింది. అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు.

శభాష్ అక్షర్..
అతని ఆటతీరు చూసిన అభిమానులు అక్షర్ పటేల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ్యాచ్ ఓడినా కూడా అక్షర్ ఆటతీరు వంద కోట్ల మంది మనసులు గెలుచుకుందని కొనియాడుతున్నారు. టీమిండియా టాప్ బ్యాటర్లంతా ఎలా ఆడాలో అక్షర్‌ను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేశారు. దీంతో ట్విట్టర్ ట్రెండింగ్‌లో అక్షర్ పటేల్ టాప్‌లో నిలిచాడు. అక్షర్ ఇంత అద్భుతంగా ఆడినా భారత జట్టు చివరకు 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసింది. మొత్తానికి 16 పరుగుల తేడాతో లంక చేతిలో ఓడింది.


Click it and Unblock the Notifications












