
చెమటోడ్చిన ఆసీస్ బౌలర్లు..
కునేమన్ వేసిన బంతికి అనవసరంగా చెత్త షాట్ ఆడిన రోహిత్.. లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనిలో కునేమన్ చేసిందేం లేదు. అలాగే పుజారా అవుటైన బంతిలో కూడా స్పెషల్ ఏం లేదు. పుజారా సరిగా బంతిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూ అవుటయ్యాడు. గిల్ కూడా అదే వరుసలో చేరాడు. లియాన్ బంతిని అతను బాగానే అంచనా వేశాడు. కానీ కాన్సన్‌ట్రేషన్ కొద్దిగా సన్నగిల్లడంతో బ్యాటును అనుకున్నంత వేగంగా కిందకు దించలేకపోయాడు. దీంతో అతను కూడా ఎల్బీడబ్ల్యూగా మైదానం వీడాడు.

తన స్టైల్ మార్చుకున్న అశ్విన్..
ఇదంతా చూసిన అభిమానులకు అశ్విన్ ఎంత కష్టపడి ఆసీస్ బ్యాటర్లను అవుట్ చేశాడో అర్థమైంది. సాధారణంగా బౌలింగ్ చేసేప్పుడు అశ్విన్ పెద్దగా కష్టపడినట్లు కనిపించడు. ఎక్కువగా బుర్ర ఉపయోగిస్తూ.. తనదైన వేరియేషన్స్‌తో వికెట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ నాలుగో మ్యాచులో మాత్రం.. వికెట్లు తీసేందుకు అశ్విన్ చాలా కష్టపడ్డాడు. తన బౌలింగ్ యాక్షన్‌లో కూడా మార్పులు చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అశ్విన్ వెల్లడించాడు. తన రిస్ట్ పొజిషన్, బౌలింగ్ యాక్షన్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నానని, అందుకే వికెట్లు కూడా తీసుకోగలిగానని అశ్విన్ వివరించాడు.

భుజం నొప్పితో..
ఈ మ్యాచ్ మధ్యలో అశ్విన్.. ఓవర్, ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత బౌండరీ లైన్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఫిజియోతో తన భుజానికి కాపడం పెట్టించుకుంటూ కనిపించాడు. బౌలింగ్ యాక్షన్ మార్చడంతో అతని భుజం బాగా నొప్పి చేసింది. అలాగే మణికట్టు కూడా కొంత నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతను కాపడం పెట్టించుకోవడం చాలా మంది ప్రేక్షకులు కూడా చూశారు. అంత కష్టపడ్డాడు కాబట్టే అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసుకున్నాడని కొనియాడుతున్నారు. అశ్విన్ వికెట్లు తీస్తుంటే.. మిగతా బౌలర్లు అందరూ చాలా ఆర్డినరీగా కనిపిస్తున్నారని మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












