Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : వన్డేల్లో మళ్లీ విఫలమైన సూర్య.. వేస్ట్ అంటూ మండిపడిన ఫ్యాన్స్

Fans fumes at Suryakumar Yadav after failing in INDvsNZ first ODI

టీమిండియా బెస్ట్ టీ20 బ్యాటర్ ఎవరు? అంటే అందరూ చెప్పే పేరు సూర్యకుమార్ యాదవ్. కానీ అతనే ఇతర ఫార్మాట్లలో అంతగా రాణించడం లేదు. న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి వన్డేలో మరోసారి విఫలమయ్యాడు. టీ20ల్లో దుమ్ముదులిపే సూర్యపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అతను వాటిని ఏమాత్రం అందుకోలేదు. వన్డే వరల్డ్ కప్ జట్టులో అతను కూడా స్థానం సంపాదించుకుంటాడని అంతా అనుకున్నారు.

అయితే ఈ ఫార్మాట్‌లో సూర్య పెద్దగా సాధించింది ఏమీ లేదు. కేవలం ఆరు నెలల్లోనే టీ20ల్లో మూడు సెంచరీలు బాదిన అతను.. వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు సెంచరీలు చేయలేదు. దానికితోడు కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా విఫలమయ్యాడు. తను ఎదుర్కొన్న రెండో బంతికే బౌండరీ బాదిన అతను తన ఇన్నింగ్స్ టెంపో సెట్ చేశాడు. కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. 26 బంతుల్లో 36 పరుగులు చేసి ఒక సాధారణ బంతికి పెవిలియన్ చేరాడు.

డారియల్ మిచెల్ వేసిన స్లో బాల్‌ను భారీ షాట్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. అయితే ఆ బంతి అతను అనుకున్నంత వేగంగా రాలేదు. దీంతో షార్ట్ కవర్‌లో ఉన్న శాంట్నర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇటీవలి కాలంలో వన్డేల్లో కనీసం 20 పరుగుల మార్కు కూడా దాటలేకపోతున్న సూర్యకుమార్.. ఈ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేయడంతో అభిమానుల్లో ఆశలు పెరిగాయి.

వన్డే ఫార్మాట్‌లో కూడా సూర్య తన మ్యాజిక్ చేసేస్తాడని అనుకున్నారు. కానీ వాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అందరూ సూర్యపై మండిపడుతున్నారు. టీ20లకు తప్ప మరే ఫార్మాట్‌కూ సూర్య పనికిరాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఇప్పుడు అదే ట్రెండ్ అవుతోంది. 'సింగిల్ ఫార్మాట్ బుల్లీ' అంటూ సూర్యను ఎండగడుతున్నారు. మరి రెండో వన్డేలో అయినా రాణించి, తనకు వచ్చిన చెడ్డపేరును సూర్య చెరిపేసుకుంటాడేమో చూడాలి.

Story first published: Thursday, January 19, 2023, 15:52 [IST]
Other articles published on Jan 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+