Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రిటైర్‌మెంట్ సిరీస్.. స్టార్ క్రికెటర్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు!

Fans fumes at David Warner for failing in first INDvsAUS Test

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో కూడా ఫెయిలైన స్టార్ క్రికెటర్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఈ సిరీస్ అతనికి ఇక రిటైర్‌మెంట్ సిరీస్ అంటూ జోకులు పేలుస్తున్నారు. అతనెవరో కాదు.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. చాలా కాలంగా ఫామ్‌ లేక తంటాలు పడిన వార్నర్.. ఇటీవలే డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత గాడిన పడ్డాడని అంతా అనుకున్నారు.

వరుస వైఫల్యాలు..

వరుస వైఫల్యాలు..

కానీ ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. అతని ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలో భారత్‌లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతనికి చాలా కీలకం అని అంతా డిసైడ్ అయిపోయారు. భారత్‌లో ఆడిన అనుభవం ఉన్న వార్నర్.. ఈ సిరీస్‌లో ఆసీస్‌కు చాలా కీలకం అని నిపుణులు కూడా చెప్పారు. అయితే తన డబుల్ సెంచరీ ఫామ్‌ను కొనసాగించలేకపోయిన వార్నర్.. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు.

వార్నర్ క్లీన్ బౌల్డ్..

వార్నర్ క్లీన్ బౌల్డ్..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు ఉస్మాన్ ఖవాజా (1)తో కలిసి శుభారంభం ఇవ్వడంలో వార్నర్ విఫలమయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఖవాజా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన వార్నర్ కూడా దారుణంగా ఫెయిలయ్యాడు. మహమ్మద్ షమీ వేసిన ఓవర్లో డిఫెన్స్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్ మీదకు షమీ వేసిన బంతిని డిఫెండ్ చేయబోయిన వార్నర్ విఫలమయ్యాడు. అతని బ్యాటును తప్పించుకున్న బంతి నేరుగా వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను గాల్లోకి ఎగరేసింది. ఆ బంతికి ఏం చెయ్యలేకపోయిన వార్నర్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.

ఇది రిటైర్‌మెంట్ టూర్..

ఇది రిటైర్‌మెంట్ టూర్..

వార్నర్ అవుటయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు కేవలం 2 పరుగులే కావడం గమనార్హం. అంటే రెండు పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన ఆస్ట్రేలియాకు.. బ్యాటుతో ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆ తర్వాత లంచ్ వరకు స్మిత్, లబుషేన్ కలిసి ఆ జట్టు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ లంచ్ తర్వాత జడేజా బౌలింగ్‌లో ఇద్దరి వికెట్లూ కోల్పోయింది. ఇది చూసిన నెటిజన్లు వార్నర్‌ను తిట్టిపోస్తున్నారు. 'ఇది వార్నర్‌కు రిటైర్‌మెంట్ సిరీస్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'ఇక తన కెరీర్ అంతా భారతీయ పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ బతికేస్తాడు. అదే అతనికి వచ్చింది' అంటూ తిట్టిపోస్తున్నారు.

Story first published: Thursday, February 9, 2023, 15:09 [IST]
Other articles published on Feb 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+