
హైదరాబాద్: ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలపడంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ అజేయంగా 84 పరుగులు సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బౌల్ వేసిన ఓవర్‌లో 15 పరుగులు సాధించింది.
స్టోక్స్, బట్లర్‌లు బౌల్ట్ బౌలింగ్‌ల్ ఎదురుదాడికి దిగడంతో సూపర్ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు. సూపర్ ఓవర్‌లో కూడా బెన్ స్టోక్స్ ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేయగా... బట్లర్ 7 పరుగులు చేశాడు. అనంతరం సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయగా మళ్లీ మ్యాచ్ టై అయ్యింది.
అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు. కాగా, ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా బెన్ స్టోక్స్ అందుకున్నాడు.
ఈ ఫోటోని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ బెన్ స్టోక్స్‌ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్‌గా పేర్కొంది. ఈ ఫోటో భారత అభిమానులకు కోపం తెప్పించింది. ఈ ట్వీట్‌పై సచిన్ టెండూల్కర్ అభిమానులు మండిపడుతున్నారు. " గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో తెలుసా?" అంటూ ఒక అభిమాని ట్వీట్ చేశాడు.
"సచిన్‌తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్ లెజెండ్, ఎవరు ఎన్ని చేసినా సచిన్ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం" మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. "ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్ టైమ్ గ్రేట్ అనేది అర్థమవుతుంది కదా" అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు.
"బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదు. ఇలా పోస్ట్ చేసిన వాడిని చెప్పుతో కొట్టాలి" అంటూ మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.