Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : రెండో వన్డేలో రాణిస్తారా?.. ఈ ముగ్గురిపైనే అందరి చూపు!

Fans focus on these three players in second INDvsNZ ODI

భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన తొలి వన్డే ఉత్కంఠ భరితంగా సాగింది. 349 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత జట్టు తడబడింది. చివరకు కేవలం 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో రెండో వన్డేపై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లపై అందరి చూపు ఉండనుంది. వాళ్లెవరంటే..

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

బొటనవేలి గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియా సారధి రోహిత్ శర్మ ఆటతీరులో చాలా మార్పు కనిపిస్తోంది. బంతిని ఎక్కువగా మిడిల్ చేస్తూ.. చక్కగా ఆడుతున్నాడు. కానీ తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రోహిత్ బాగానే ఆడాడు.

రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 34 పరుగులు చేశాడు. కానీ దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే అతని ఆటతీరును చూసిన మాజీలంతా త్వరలోనే రోహిత్ కూడా గాడిన పడతాడని అంటున్నారు. అందుకే రోహిత్ శర్మ ఎలా ఆడతాడని అంతా ఎదురు చూస్తున్నారు.

మైకేల్ బ్రేస్‌వెల్

మైకేల్ బ్రేస్‌వెల్

తొలి వన్డేలో భారత జట్టును ఒంటి చేత్తో ఓడించినంత పని చేశాడీ కివీ ఆల్‌రౌండర్. కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. అతను క్రీజులో ఉన్నంత సేపూ మ్యాచ్ చేజారిపోతుందని టెన్షన్ పడినట్లు రోహిత్ శర్మ కూడా ఒప్పుకున్నాడంటేనే బ్రేస్‌వెల్ ఎంత అద్భుతంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఆటగాడు రెండో వన్డేలో ఎలా ఆడతాడని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత మంచి బ్యాటర్‌ను మరీ చివర్లో కాకుండా.. కొంచెం ముందుగా క్రీజులోకి పంపితే బాగుంటుందని అంటున్నారు.

శుభ్‌మన్ గిల్

శుభ్‌మన్ గిల్

టీమిండియా క్రికెట్ భవిష్యత్తుగా అందరూ భావిస్తున్న ఆటగాడు శుభ్‌మన్ గిల్. ఈ 23 ఏళ్ల క్రికెటర్ తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ కూడా తొలి వన్డేలోనే బాదేశాడు. గతేడాది తొలి వన్డే సెంచరీ చేసిన అతను.. ఈ ఏడాది తొలి డబుల్ సెంచరీ కూడా చేసేశాడు. ప్రస్తుతం గిల్ తన కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు.

దీంతో అతను రెండో వన్డేలో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని దాదాపు పదిలం చేసుకున్న గిల్.. రెండో వన్డేలో కూడా బ్యాటు ఝుళిపించాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Story first published: Saturday, January 21, 2023, 9:07 [IST]
Other articles published on Jan 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+