త్రివేండ్రంలో 35 అడుగుల కటౌట్‌తో ధోనికి ట్రిబ్యూట్ (వీడియో)


త్రివేండ్రం: మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌కు రెండు వరల్డ్ కప్ టైటిళ్లను అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు ఐసీసీ నిర్వహించే మూడు టోర్నీల్లో భారత జట్టుని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ధోనిపై ఉన్న అభిమానాన్ని అభిమానులు ఎలాగోలా చాటుకుంటూనే ఉంటారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరగబోయే ఐదో వన్డేకు తిరువనంతపురం ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా ధోని అభిమానులు కొందరు 35 అడుగుల ఎత్తున్న అతని కటౌట్‌ను తయారు చేయించారు.
త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం ధోని కటౌట్
ఆల్ కేరళ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం బయట ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ను తయారు చేస్తున్నప్పటి వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వికెట్ కీపింగ్‌లో సత్తా చాటుతోన్న ధోని
ఇదిలా ఉంటే ఈ సిరిస్‌లో ధోని బ్యాట్‌తో పెద్దగా రాణించకపోయినా వికెట్ కీపింగ్‌లో సత్తా చాటుతున్నాడు. తాజాగా, ముంబై వేదికగా జరిగిన వన్డేలో ధోనీ మరోసారి తన స్టైల్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. క్రీజు బయటికి వెళ్లిన బ్యాట్స్‌మన్ స్పందించేలోపే ధోనీ వికెట్లను గిరాటేశాడు. ఆ తర్వాత ఔట్ అని డిక్లేర్ చేస్తూ.. ముందుకొచ్చేశాడు. ఆ విషయం బౌలింగ్ వేస్తున్న రవీంద్ర జడేజాకు కూడా అర్థం కాలేదు.
జడేజా విసిరిన ఐదో బంతిని పాల్ డిఫెన్స్ ఆడేందుకు
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్న 28వ ఓవర్ అది. క్రీజులో కీమో పాల్ ఉన్నాడు. ఆ ఓవర్‌లోని జడేజా విసిరిన ఐదో బంతిని పాల్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి పాల్ బ్యాట్‌ను తప్పించుకుని ధోనీ చేతిలో పడింది. కనురెప్పపాటులో స్పందించిన ధోనీ వికెట్లను గిరాటేశాడు. ఆ సమయంలో కీమో పాల్ కాలు క్రీజు బయటికి వచ్చింది.
కేవలం 0.08 సెకన్లలో స్టంపౌట్ చేసి ధోని
అతను స్పందించేలోపే ధోనీ తనపని కానిచ్చాడు. కేవలం 0.08 సెకన్లలో స్టంపౌట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ధోనీ స్టంప్ చేయగానే ఔటా..? అన్నట్లు బౌలర్ జడేజా చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఆ అయిపోయింది అది అవుటే అన్నట్టు చిరునవ్వుతో ధోనీ సమాధానం ఇచ్చాడు. ఈ స్టంప్ అప్పీల్‌ను పరిశీలించిన టీవీ అంపైర్ ఔట్‌గా నిర్ణయించారు. దీంతో విండీస్ బ్యాట్స్‌మన్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications