Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మాకూ కావ్య మేడమ్ లాంటి మేనేజర్ కావాలి!

Sunrisers Hyderabad: ప్రస్తుత వర్క్ లైఫ్‌లో ఇచ్చిన టాస్క్ అండ్ టార్గెట్ పూర్తి చేయకపోయిన, సరైన పెర్ఫామెన్స్ ఇవ్వకపోయినా టీమ్ లీడర్లు, మేనేజర్లు పెట్టే టార్చర్ అంతా ఇంతా కాదు. ముందు వర్క్ ఆ తర్వాత ఇంకేదైనా అంటూ తీవ్ర ఒత్తిడి చేస్తుంటారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం తమ ఆటగాళ్లు చెత్త ప్రదర్శన చేస్తోన్న, కీలక మ్యాచులకు ముందు వారికి రిలాక్షేషన్ ఇచ్చేందుకు మాల్దీవులకు పంపించింది. అయితే ఇదే సమయంలో పలువురు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు.. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే?

గత సీజన్‌లో అద్భుతంగా రాణించి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి పేలవ ప్రదర్శనలతో బోల్తా పడింది. వరుస పరాజయాలను అందుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచులో గెలిచి.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను బతికించుకుంది. కానీ నాకౌట్ కు అర్హత సాధించాలంటే.. ఈ లీగ్ దశలో మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది.

Fans criticizes Kavya Maran for sending SRH players to Maldives in Midseason

మాల్దీవులకు ఆటగాళ్లు..
ఇప్పుడు సన్‌రైజర్స్ తన నెక్ట్స్ మ్యాచును మే2న గుజరాత్ టైటాన్స్ తో ఆడాలి. అంటే దాదాపు వారం రోజుల విరామం దొరికింది. అయితే ఈ కీలక మ్యాచుకు ముందు.. ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లారు. మాల్దీవులకు ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి వెళ్లారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. ప్లేయర్సంతా చిల్ కొడుతూ ఫుల్ జోష్ లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇప్పుడిది అవసరమా?
అయితే ఈ వీడియోలపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. 'చెత్త ప్రదర్శన చేస్తూ, లీగ్‌ మధ్యలో సేద తీరడం అవసరమా', 'కీలక మ్యాచుల్లో ఎలా గెలవాలనేది ప్రాక్టీస్ చేయాల్సింది పోయి, మాల్దీవులకు వెళ్లడం ఏంటి' అంటూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు.. 'కీలక మ్యాచ్‌లకు ముందు ఫిజికల్ గా, మానసికంగా ఆటగాళ్లకు రీఫ్రెష్ మెంట్ కోసం ఈ మినీ వేకేషన్‌ అవసరమేన'ని మద్దతుగా నిలుస్తున్నారు.

కావ్య లాంటి మేనేజర్ కావాలి..
"ఇప్పుడు వెనక్కి వచ్చి కూడా ఇక్కడ ఏం చేస్తారు, కొద్ది కాలం అక్కడే ఉండండి, లల్లూ పెర్ఫామెన్స్ తర్వాత కూడా మాల్దీవుల వెకేషన్.. మాకు కూడా కావ్య లాంటి మేనేజర్ కావాలి, కేవలం గెలిచింది మూడు మ్యాచులే.. పరిస్థితి అర్థం చేసుకుని నెక్ట్స్ జీటీతో మ్యాచు కోసం ప్రాక్టీస్ చేయాల్సింది పోయి, కావ్య మారన్ వాళ్లను మాల్దీవులకు పంపడం ఏంటి" అంటూ కావ్య మారన్ పై విమర్శలు చేస్తున్నారు.

Story first published: Sunday, April 27, 2025, 15:21 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+