Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvsPAK: ఈసారి ప్రపంచకప్ వాళ్లదే.. క్రేజీ థియరీ చెప్తున్న ఫ్యాన్స్.. ఈ లెక్కన భారత్‌కు ట్రోఫీ ఎప్పుడు?

Fans crazy theory decides T20 World Cup winner

ప్రపంచకప్‌లో ఎప్పుడు ఏ జట్టు ఓడినా.. అది ఎందుకు జరిగిందో కొందరు ఫ్యాన్స్ చటుక్కున చెప్పేస్తుంటారు. మ్యాచుల మధ్య, ఆటగాళ్ల మధ్య ప్యాటర్న్ పట్టేయడంలో కొందరు ఫ్యాన్స్ సిద్ధహస్తులు.

ఈ క్రమంలోనే కొత్తగా టీ20 ప్రపంచకప్‌లో ఎవరు గెలుస్తారో కొందరు ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు. వాళ్లు చెప్పే ఐసీసీ ఫార్ములా నిజమైతే భారత జట్టుకు ఇప్పుడప్పుడే ప్రపంచకప్ దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది.

కరోనా తర్వాత రీసెట్

కరోనా తర్వాత రీసెట్

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెమ్మదిగా ప్రేక్షకులు లేని స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుటు మళ్లీ క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొచ్చి, అవసరమైతే అంతకుమించి క్రేజ్ తీసుకువచ్చేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోందని కొందరి వాదన. దీనిలో భాగంగానే ఐసీసీ ట్రోఫీల్లో ఒక కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చిందని, దాని ప్రకారమే ఆయా జట్లు ట్రోఫీలు గెలుస్తాయని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

ఆ ఆర్డర్‌లోనే ట్రోఫీలు!

ఆ ఆర్డర్‌లోనే ట్రోఫీలు!

కరోనా తర్వాత జరిగిన మొదటి మేజర్ ఐసీసీ ట్రోఫీ.. టీ20 ప్రపంచకప్. దీనిలో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. దీంతో ఆంగ్ల అక్షరమాల (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) క్రమంలో కప్పు ఇస్తారని కొందరు అంచనా వేశారు. ఆ లెక్కన ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి జట్లకు ట్రోఫీ దక్కాలి కదా అంటే.. అలాంటి చిన్న జట్లకు ట్రోఫీ ఇవ్వరనేది వాళ్ల వాదన. ప్రపంచ క్రికెట్‌లో టాప్-5 లేదా టాప్-6 జట్లకే ఈ పద్ధతిలో ట్రోఫీ అందిస్తారని కాన్సిరసీ థియరీ అన్నమాట. మధ్యలో ఎప్పుడైనా శ్రీలంక వంటి జట్టును గెలిపిస్తే.. జనాలు ఈ ప్యాటర్న్ మర్చిపోతారు కదా.

అసలు ఆర్డర్ వాళ్లదే!

అసలు ఆర్డర్ వాళ్లదే!

ఎలా చూసుకున్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్ రెండూ ఎక్కడెక్కడో వస్తాయి. దానికి తోడు పాకిస్తాన్ గతేడాది కూడా ఫైనల్ చేరింది. ఈ విషయాన్ని అడిగితే.. ఈ థియరిస్టులు చెప్తున్న వాదన మరింత ఆసక్తికరంగా ఉంది. అసలు ఐసీసీ చూస్తోంది జట్ల పేర్లు కాదట. వాటి కెప్టెన్ల పేర్లట. అంటే గతేడాది ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) ఫైనల్‌కు వెళ్లారు. ఈ రెండు పేర్లు ఇంగ్లీషులో రాస్తే.. 'ఏ', 'బీ'లతో వస్తున్నాయని కనిపిస్తోంది కదా.

ఈ ఏడాది ట్రోఫీ వాళ్లదే..

ఈ ఏడాది ట్రోఫీ వాళ్లదే..

రీజనింగ్‌లో ఏ తర్వాత ఏబీ, బీఏ.. ఇలానే సిరీస్ సాగుతుంది. అదే పద్ధతిలో ఈ ఏడాది బాబర్ ఆజమ్ (బీ లేదంటే ఏ), బట్లర్ (బీ) ఫైనల్ వచ్చారు. గతేడాది ప్యాటర్న్ ఫాలో అయితే ఆజామ్ గెలుస్తాడన్నమాట. ఈ లెక్కన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కనీసం ఫైనల్ చేరకపోవడం పెద్ద ఆశ్చర్యం ఏముందని వాళ్ల వాదన. వచ్చే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినా.. మిగతా జట్ల కెప్టెన్లు కూడా మారితే మరోసారి భారత్‌కు ట్రోఫీ దూరమయ్యే అవకాశం ఉందని వాళ్లంటున్నారు. అయితే ఆదివారం నాడు జరిగే ఫైనల్‌లో నిజంగానే పాకిస్తాన్ గెలిస్తే.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలాగే వచ్చే ఏడాది పాక్ జట్టు కూడా సెమీస్ చేరదని వాళ్ల అభిప్రాయం. మరి వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇదే ప్యాటర్న్ కనిపిస్తుందా? లేదంటే కొత్త థియరీతో అభిమానులు ముందుకొస్తారో చూడాలి.

Story first published: Sunday, November 13, 2022, 11:43 [IST]
Other articles published on Nov 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+