న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: బంగ్లా చేతిలో భారత్ ఓటమి.. ఈ సీన్స్ చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు..!

Fans could not sit calmly during these three INDvsBAN moments

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేలవ ప్రదర్శనతో ఓటమి మూటగట్టుకుంది. అదే సమయంలో మొక్కవోని ధైర్యం చూపిన బంగ్లా జట్టు విజయ తీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ అత్యంత దారుణంగా విఫలమైంది. అదే సమయంలో బౌలర్లు మెరుగ్గా రాణించారు. కానీ ఫలితం మాత్రం భారత్‌కు అనుకూలంగా రాలేదు. ఈ క్రమంలో తొలి వన్డేలో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి చూసిన తర్వాత అభిమానులు ఎవరూ తమ సీట్లలో కుదురుగా కూర్చోలేకపోయారనడం అతిశయోక్తి కాదు. అవేంటో ఒకసారి పరిశీలిస్తే..

షకీబల్ హసన్ మ్యాజిక్..

షకీబల్ హసన్ మ్యాజిక్..

భారత జట్టు బ్యాటింగ్ చేస్తుండగా అభిమానులకు తొలి షాక్ తగిలింది. ఇది జరిగినప్పుడు బంగ్లా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోగా.. భారత అభిమానులు నిరాశలో కుంగిపోయారు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన రోహిత్ శర్మ (27)ను షకీబల్ పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (9)ని కూడా అవుట్ చేశాడు. షకీబల్ వేసిన బంతిని కవర్ డ్రైవ్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ అందుకున్న సూపర క్యాచ్‌కు కోహ్లీ మైదానం వీడాడు. ఈ ఓవర్‌ను భారత అభిమానులు అంత త్వరగా మర్చిపోవడం అసాధ్యం.

కోహ్లీ స్క్రీమర్..

కోహ్లీ స్క్రీమర్..

మైదానంలో చురుగ్గా కదులుతూ అసాధ్యమైన క్యాచ్‌లు అందుకోవడం కోహ్లీ స్పెషాలిటీ. బంగ్లాదేశ్ వన్డేలో కూడా అతను అదే చేసి చూపించాడు. బ్యాటింగ్‌లో షకీబల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్‌లో ఎవరూ ఊహించని విధంగా తను కూడా సూపర్ క్యాచ్ అందుకొని షకీబల్ హసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. తనను అవుట్ చేసిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌‌ను పెవిలియన్ చేర్చాడు. లిటన్ దాస్ అవుటైన తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన షకీబల్.. స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టి అడపా దడపా బౌండరీలు కూడా రాబడుతున్నాడు.

అతను క్రీజులో ఉంటే మ్యాచ్ టీమిండియా చేయి జారిపోవడం ఖాయంగా కనిపించింది. అలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు షకీబల్ ప్రయత్నించాడు. షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లీ తన కుడి చేతి వైపు దూకి ఒంటి చేత్తో క్యాచ్ పట్టేసి భారత జట్టును మళ్లీ పోటీలోకి తీసుకొచ్చాడు.

రాహుల్ వదిలేసిన క్యాచ్

రాహుల్ వదిలేసిన క్యాచ్

ఈ మ్యాచ్‌లో చాలా ఘటనలు మ్యాచ్‌ను మలుపు తిప్పిన మాట వాస్తవం. కానీ కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్ మాత్రం వీటన్నిటిలో టాప్‌లో నిలుస్తుంది. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు ఓటమి అంచున నిలిచింది. అలాంటి సమయంలో మెహదీ హసన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను రాహుల్ జారవిడిచాడు.

అది చూసిన భారత అభిమానులు షాకైపోయారు. అంత సులభమైన క్యాచ్ వదిలేయడం ఏంటని తలలు పట్టుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న మెహదీ హసన్.. పదో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బంగ్లాను గెలిపించాడు కూడా. దీంతో భారత అభిమానులు రాహుల్‌పై మండి పడుతున్నారు. ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తున్నారేంటి? అని టీమిండియాను తిట్టిపోస్తున్నారు. ఈ క్యాచ్‌ను కూడా భారత అభిమానులు చాలా కాలం మర్చిపోలేరు.

Story first published: Monday, December 5, 2022, 10:33 [IST]
Other articles published on Dec 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X