Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏషియన్ గేమ్స్‌కు టీమిండియా ఎంపిక.. గోల్డ్ మెడల్ ఖాయం అంటున్న ఫ్యాన్స్!

చైనా వేదికగా జరగబోయే 'ఏషియన్ గేమ్స్'లో క్రికెట్ కూడా ఆడనున్నారు. ఇలా ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ ఆడుతున్న జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో రాణించి భారత జట్టులోచోటు కోసం ఎదరు చూస్తున్న చాలా మందికి ఈ జట్టులో సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో గైక్వాడ్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్‌గా ఐపీఎల్‌లో చెలరేగిన యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చారు. వీరితోపాటు తిలక్ వర్మ, జితేశ్ ర్మ, రింకూ సింగ్ వంటి కీలక ప్లేయర్లకు ఈ టీంలో చోటు దక్కింది. ఇదంతా చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న వాళ్లనే సెలెక్టర్లు టీంలోకి తీసుకున్నారని మెచ్చుకుంటున్నారు.

BCCI announces Team India for Asia Games

ఆసియా గేమ్స్‌లో పాల్గొనడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ క్రమంలోనే ఆసియా గేమ్స్‌కు పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును పంపాలని బీసీసీఐ డిసైడ్ అయింది. ఐపీఎల్‌తోపాటు దేశవాళీల్లో రాణించిన కుర్రాళ్లను సెలెక్ట్ చేసింది.

'ఈ ఏడాది సెప్టెంబరు 8 నుంచి చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. వీటికి పంపే భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 8 వరకు టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ టోర్నీ జరుగుతుంది' అని బీసీసీఐ తెలిపింది.

ఈ క్రమంలో సెలెక్ట్ చేసిన జట్టును చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ప్రతి విభాగంలో టాప్ పెర్ఫామర్లు ఉన్నారంటూ మెచ్చుకుంటున్నారు. రుతురాజ్ నాయకత్వంలో తొలి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓపెనింగ్, మిడిలార్డర్, ఫినిషర్లు, పేసర్లు, స్పిన్నర్లు అన్ని విభాగాల్లో సూపర్ ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారని మెచ్చుకుంటున్నారు.

టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణయి, ఆవేష్ ఖాన్,, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

స్టాండ్ బై ప్లేయర్లు: వెంకటేశ్ అయ్యర్, యష్ ఠాకూర్, సాయి కిషోర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్

Story first published: Saturday, July 15, 2023, 14:19 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+