Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మనా బూతులు తిడుతున్న ఫ్యాన్స్.. జింఖానా గ్రౌండ్స్ వద్ద లాఠీఛార్జి.. ఇండియా-ఆసీస్ టీ20 టికెట్ల కోసం రభసా

Fans clamoring for Uppal match tickets.. Police baton charge to bring the situation under control

ఈ నెల 25వ తేదీన ఆదివారం భారత్‌ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌ వేదికగా మూడో టీ20మ్యాచ్‌ మన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనుందనే సంగతి తెలిసిందే. సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం పోటెత్తుతున్నారు. ఈ మ్యాచ్‌ కోసం నగరంలోని జింఖానా మైదానంలో నేడు ఉదయం 10నుంచి టికెట్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి.

టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూలైన్లలో పడిగాపులు కాశారు. ఇక టికెట్ల సమయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం కౌంటర్ వద్ద పోటెత్తడంతో తొక్కిసలాట అలాగే రభస చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో అక్కడే ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులు లాఠీచార్జ్‌ మొదలెట్టారు. పరిస్థితి సద్దుమణిగినప్పటికీ.. చాలా మంది ఫ్యాన్స్‌కు టికెట్లు మాత్రం అందని ద్రాక్షలా మారింది. కొందరు టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

వార్నింగ్ ఇచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్

టికెట్ల విషయంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఫుల్ గైడ్ లైన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ టికెట్స్‌ వ్యవహారం గనుక జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి టికెట్ లెక్కాపత్రం తప్పకుండా తనకు తెలియపరచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్‌ టికెట్స్‌ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దంటూ హితవు పలికారు. బ్లాక్‌ దందా చేసే వాళ్లపై చర్యలు ఘోరంగా ఉంటాయన్నారు.

తిట్ల ట్వీట్లతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్

ఇకపోతే టిక్కెట్ల కోసం లైన్లలో పడిగాపులు కాచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అమ్మనా బూతులు తిడుతూ హెచ్‌సీఏ మేనేజ్ మెంట్ మీద కోపోద్రిక్తులు అవుతున్నారు. ఇంకొందరైతే ట్విట్టర్ వేదికగా అజారుద్దీన్‌ను టార్గెట్ చేస్తూ తిట్ల ట్వీట్లు హోరెత్తిస్తున్నారు. కొందరు ఎలాగోలా టికెట్ పొందిన సంతోషాన్ని తమ టికెట్ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

టికెట్ల కోసం ప్రముఖుల నుంచి భారీ ఒత్తిడి

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సుమారు 16 ఎకరాల్లో 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. స్టేడియం సామర్థ్యం 55 వేలు సీట్ల వరకు ఉంటుంది. ఇందులో 39 వేల టికెట్లు మాత్రమే విక్రయిస్తుంటారు. వీటిలో దాదాపు 10 వేల టికెట్ల వరకు కాంప్లిమెంటరీగా ఇవ్వగా మిగిలిన 29 వేల టికెట్లను విక్రయానికి ఉంచుతున్నారు. టికెట్ల ధరలు రూ.850 నుంచి 15000 వరకు ఉన్నాయి. కార్పోరేట్ బాక్స్‌లు 40 వరకు ఉండగా.. ఒక్కో బాక్స్‌లో 20 వరకు సీట్ల సర్దుబాటు ఉంటుంది. అయితే మూడేళ్ల తర్వాత నగరంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో సినీ,రాజకీయ, పోలీస్ ప్రముఖుల నుంచి టికెట్ల కోసం హెచ్‌సీఏ అధికారులపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Story first published: Thursday, September 22, 2022, 12:26 [IST]
Other articles published on Sep 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+