Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sachin Tendulkar : హ్యాపీ బర్త్ డే సచిన్.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే కళ్లు తిరిగాల్సిందే!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 50వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్‌ వెన్నెముకలా నిలిచిన అతను.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మరి తమ అభిమాన క్రికెటర్ బర్త్ డే వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియా మొత్తాన్ని బర్త్‌ డే విషెస్‌తో హోరెత్తించారు.

సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెట్ స్టార్లు కూడా సచిన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సెహ్వాగ్, గంగూలీ, భజ్జీ వంటి వాళ్లు అందరూ సచిన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే అతనితో తాము పంచుకున్న ఆసక్తికర ఘటనలను గుర్తు చేసుకున్నారు.

happy birthday sachin tendulkar

ఇలా అందరూ క్రికెట్ దేవుడికి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. దీంతో ట్విట్టర్‌లో 'హ్యాపీ బర్త్ డే సచిన్' అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, కొందరు సచిన్ వీరాభిమానులు ఈ క్రికెట్ దేవుడిపై తమ అభిమానాన్ని తెలిపేలా ఈ విషెస్ చెప్తున్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కూడా సచిన్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సచిన్ - లారా గేట్‌ను తెరుస్తున్నట్లు ప్రకటించింది.

వీటన్నింటిలో ఒక అభిమాని తెలిపిన ఒక ఫ్యాన్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక ఫ్యాన్ ఇంక్‌లో ముంచిన బంతిని గోడకి వేసి కొడుతూ సచిన్ చిత్రాన్ని గీశాడు. అలా అతను బంతితో వేసిన బొమ్మ వీడియోను చూసిన నెటిజన్లు ఈ కుర్రాడి ట్యాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. భారత్‌లో సచిన్ క్రేజ్ అంతా ఇంతా కాదని, ఇలాంటి వాళ్లు కోట్ల మంది ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా మనం కూడా సచిన్‌కు గట్టిగా 'బర్త్ డే' విషెస్ చెప్పేద్దామా?

Story first published: Monday, April 24, 2023, 14:14 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+