
కొన్ని రోజుల క్రితమే న్యూజిల్యాండ్ గడ్డపై టీ20 శతకంతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. వన్డే ఫార్మాట్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. కివీస్‌తో తొలి వన్డేలో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో 25 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు. అయితే మూడో వన్డేలో మరోసారి చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు
గతేడాది వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. అప్పుడు మిడిలార్డర్‌లో కొంతమేర నిలకడగానే రాణించాడు. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచి వన్డే ఫార్మాట్‌లో పెద్దగా రాణించడంలేదు. ఈ ఏడాదిలో మొత్తం 11 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్.. కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు ఈ ఏడాది వన్డేల్లో అతని సగటు 28.22 మాత్రమే కావడం గమనార్హం. ఈ ఫార్మాట్‌లో సూర్య కష్టాలు కివీస్ టూర్‌లో మరోసారి తేటతెల్లం అయ్యాయి.
మూడో వన్డేలో ఆడమ్ మిల్నే వేసిన బంతి ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తోంది. దాన్ని అనవసరంగా కదిలించుకున్న సూర్య.. బ్యాటును ముందుకు కదిలించాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి మొదటి స్లిప్‌లో ఉన్న సౌథీ వైపు వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటు చెయ్యకుండా క్యాచ్ పట్టేయడంతో మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యాడు సూర్యకుమార్ యాదవ్.
ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న క్రికెట్ అభిమాను.. సూర్య అద్భుతమైన టీ20 ప్లేయరే కానీ, వన్డేల్లో అతను రాణించలేడంటూ కామెంట్లు చేస్తున్నారు. సూర్య వన్డే ప్లేయర్ కాదనడానికి ఈ సిరీస్ ఒక్కటి సాక్ష్యంగా సరిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో టీ20ల్లో ఏమాత్రం రాణించలేకపోయిన శ్రేయాస్ అయ్యర్.. ఈ ఫార్మాట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వన్డే ఫార్మాట్‌లో సూర్య కన్నా శ్రేయాస్ అయ్యర్ మంచి ఆటగాడంటూ కామెంట్లు చేస్తున్నారు.