కోహ్లీ-శాస్త్రిల లవ్ స్టోరీ బాగుంది: సోషల్ మీడియాలో నెటిజన్లు
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవిలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. కుంబ్లే రాజీనామా అనంతరం ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జులై 9 వరకు దీనికి గడువుగా నిర్ణయించింది. కోహ్లీసేన శ్రీలంక పర్యటనకు వెళ్లేలోగా కోచ్‌ను ఎంపిక జరుగుతుందని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే కోచ్ పదవి కోసం టామ్‌మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్‌లు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా తాను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నిజానికి రవిశాస్త్రి కొన్ని రోజుల కింది వరకు కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు సుముఖంగా లేడు.
ఉన్నపళంగా రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని చెప్పడం ఆశ్చర్య పరిచింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు రవిశాస్త్రి ప్రకటించగానే ట్విట్టర్‌లో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కోచ్ పదవి నుంచి తప్పుకునే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న భేదాభిప్రాయాల కారణంగానే వైదొలుగుతున్నట్లు కుంబ్లే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం కోహ్లీ తీరుపై మండిపడ్డారు. కుంబ్లేని అవమానకరంగా సాగనంపారని విమర్శలు కూడా చేశారు.
తాజాగా రవిశాస్త్రి, కుంబ్లేలలో ఎక్కువ మంది అభిమానులు కుంబ్లేకు మద్దతుగా నిలిచారు. కోచ్‌గా అతన్ని కొనసాగిస్తే భారత్ మరిన్ని విజయాలు అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోచ్ రేసులో ఉన్న రవిశాస్త్రిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ట్వీట్లు పోస్టు చేశారు.
రవిశాస్త్రిని భారత క్రికెట్ మన్మోహాన్ సింగ్‌గా అభివర్ణించిన ఫ్యాన్
టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని భారత క్రికెట్ మన్మోహాన్ సింగ్‌గా ఓ ఫ్యాన్ అభివర్ణించాడు.
ట్విలైట్ సినిమా కంటే బాగుంది
రవిశాస్త్రి-కోహ్లీ మధ్య ఉన్న ప్రేమకథ.. ట్విలైట్ సినిమా కంటే బాగుంది.
కోహ్లీ సర్వెంట్‌గా రవిశాస్త్రి
రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసుకోవడానికి వేరే కారణం ఉంది. కోహ్లీకి ఓ సర్వెంట్‌ని ఇస్తున్నారు.
గంగూలీ ఉన్నాడు జాగ్రత్త
దరఖాస్తు చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించే ప్యానెల్‌లో దాదా(గంగూలీ) ఉన్నాడు. మరిచిపోవద్దు. రవిశాస్త్రికి కోచ్ పదవి దక్కడం కష్టమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications