2nd T20I: రిషబ్ పంత్ వేస్ట్... ధోనీని తిరిగి తీసుకురండి

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని తీసుకురావడం జట్టు మేనేజ్‌మెంట్‌కు చాలా కష్టంగా మారింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరిస్ నుంచి ధోని తనకు తానుగా తప్పుకున్నాడు.
ఈ నేపథ్యంలో సపారీలతో టీ20 సిరిస్‌కు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. అయితే, రిషబ్ వాటిని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం పంత్ పెద్దగా రాణించలేదు. ఎప్పుడూ ఒకే తరహా షాట్‌కు ఔటవ్వడంపై పెద్ద చర్చ జరిగింది.

డీప్ స్వేర్ లెగ్‌లో
ముఖ్యంగా డీప్ స్వేర్ లెగ్‌లో పంత్ ఔటవుతున్న తీరు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం రాత్రి మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో సైతం పంత్ నిరాశపరించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(4) పరుగులకే వెనుదిరిగాడు. జట్టులో వికెట్ కీపర్ స్థానం గురించి అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.

ధోని తిరిగి రావాలని
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని తిరిగి రావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. వెస్టిండిస్ పర్యటనలో పంత్ పేలవ ప్రదర్శన చేసినప్పటికీ... సొంతగడ్డపై రాణిస్తాడని అంతా భావించారు. అయితే, ధర్మశాల వేదకగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో అందరి కళ్లు మొహాలీ టీ20పై పడ్డాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడనే విషయమై పెద్ద చర్చే జరిగింది.

4 పరుగులు చేసి ఔటైన పంత్
అయితే, అందరి అంచనాలను తల్లకింద్రులు చేస్తూ జట్టు స్కోరు 104 పరుగుల వద్ద షంసీ బౌలింగ్‌లో పంత్.. డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (4) ఔటైనా విరాట్ కోహ్లీ క్రీజులో ఉండడంతో టీమిండియా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ శ్రేయస్ అయ్యర్ (16 నాటౌట్)తో కలిసి విరాట్ కోహ్లీ జట్టును విజయపథంలో నడిపించాడు.

విక్రమ్ రాథోర్ సైతం ఇలా
పంత్ ఔటై క్రీజులోకి వస్తోన్న సమయంలో కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ నోట్స్ రాసుకున్నాడు. పంత్ ఔటైన తీరుపై విక్రమ్ రాథోర్ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో అతడితో తప్పక చర్చించే ఉంటాడని బుధవారం రాత్రి మ్యాచ్ చూసిన ప్రతిఒక్కరి భావిస్తున్నారు. పంత్ చెత్త షాట్ ఆడి ఔటైతే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయని హెడ్ కోచ్ రవిశాస్త్రి హెచ్చరించినా పంత్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకోకపోవడం విశేషం.

తక్కువ యావరేజిని కలిగి ఉన్న పంత్
రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ టీ20 యావరేజి 21.57గా ఉంది. రెండో టీ20కి ముందు కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ "పంత్ అన్ని షాట్లను ఆడాలని మేము కోరుకుంటున్నాం. అదే అతనికి ప్రత్యేకతను ఇస్తుంది. పంత్‌కి భయం లేకుండా ఆడటం.. అజాగ్రత్తగా ఉండటం మధ్య ఉన్న తేడా తెలియాలి" అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications