Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: అది ధైర్యం కాదు.. పిచ్చి.. బాబర్ ఆజమ్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్

Fans call Babar Azam decision bewakoofi after Pakistan escapes defeat

పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఆ దేశ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. బాబర్ తీసుకున్న నిర్ణయాన్ని పిచ్చి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్‌లో న్యూజిల్యాండ్ జట్టు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య తొలి జరిగిన తొలి టెస్టు మ్యాచులో పాక్ జట్టు ఓటమి అంచుల వరకు వెళ్లొచ్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 438 పరుగులకు ఆలౌట్ అయింది.

ఓటమికి అడుగు దూరంలో పాక్

ఓటమికి అడుగు దూరంలో పాక్

బదులుగా కివీస్ అద్భుతంగా ఆడింది. టామ్ లాథమ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఇటీవల కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలోనే నాలుగో రోజున 612/9 స్కోరు వద్ద న్యూజిల్యాండ్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 311/8 స్కోరు ఉండగా.. బాబర్ ఆజమ్ తాము ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో కివీస్ ముందు 138 పరుగుల లక్ష్యం నిలిచింది. అదే చివరి రోజు కావడంతో ఈ లక్ష్యాన్ని 15 ఓవర్లలో న్యూజిల్యాండ్ ఛేదించాల్సి వచ్చింది.

ధైర్యానికి, పిచ్చికి తేడా అదే..

ధైర్యానికి, పిచ్చికి తేడా అదే..

ఛేజింగ్‌ను న్యూజిల్యాండ్ ధాటిగా ఆరంభించింది. మైకేల్ బ్రేస్‌వెల్ (3) విఫలమైనా మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (16 బంతుల్లో 18 నాటౌట్), టామ్ లాథమ్ (24 బంతుల్లో 35 నాటౌట్) ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ ఇలాగే కొనసాగితే కివీస్ గెలిచేలా కనిపించింది. అయితే మరో 7-8 ఓవర్లు ఉన్నాయనగా.. లైట్ సరిగా లేదని భావించిన అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దీంతో పాకిస్తాన్ బతికిపోయింది. దీన్నే ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. బెన్ స్టోక్స్ చేసినట్లు బాబర్ కూడా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. స్టోక్స్‌ది ధైర్యం అయితే బాబర్‌ది పిచ్చి తనం అని మండి పడుతున్నారు.

 అంపైర్ మోసం..

అంపైర్ మోసం..

'పిచ్చికి, ధైర్యానికి మధ్యలో సన్నగీతే ఉంటుంది. అది బాబర్ తెలుసుకోవాలి' అని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. మరికొందరేమో మ్యాచ్ రిఫరీ అలీం దార్‌ను కూడా తిట్టిపోస్తున్నారు. అలీం దార్ ఐసీసీ అంపైర్ అయినా కూడా మనసులో మాత్రం పాకిస్తానీనే అని, అందుకే పాక్‌ను ఇలా కుంటి సాకులతో కాపాడాడని విమర్శలు చేస్తున్నారు. అయితే తాము మాత్రం మ్యాచులో ఫలితం కోసమే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశామని బాబర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Saturday, December 31, 2022, 9:03 [IST]
Other articles published on Dec 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+