For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భజన చేయకపోవడం వల్లేనా?: అంబటి రాయుడి రిటైర్మెంట్‌లో కోహ్లీ పాత్ర ఏమేరకు!!

Ambati Rayudu Fans Fires On Virat Kohli About Retirement || Oneindia Telugu
Fans Blame Virat Kohli For Ambati Rayudu’s Retirement After Not Being Picked For 2019 ICC Cricket World Cup

తెలుగు తేజం,టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు బుధవారం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రాయుడుకు ప్రపంచకప్‌లో భారత్ తరపున రెండు సార్లు ఆడే అవకాశం వచ్చినా.. సెలక్టర్లు ఎంపిక చేయలేదు. స్టాండ్ బైగా ఎంపికయినా.. రాయుడుకు కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడంతో రాయుడు తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అండగా ఉంటాం అని:

అయితే ఈ రిటైర్మెంట్ ప్రకటించడానికి తెర వెనుక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 2018 ఆసియా కప్‌ ముగిసిన అనంతరం రాయుడిని ఉద్దేశించి కోహ్లీ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను షేర్‌ చేస్తూ ఫైర్ అవుతున్నారు. '2019 ప్రపంచకప్‌ వరకు రాయుడికి మేం అండగా నిలవాల్సిన అవసరముంది' అని కోహ్లీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఇక గత ఏడాది అక్టోబరులో 'నాలుగో స్థానానికి సరైనవాడు' అన్న కోహ్లీ.. ఆ తర్వాత మాట మార్చి నాలుగో స్థానంకు ఇంకా ఎవరిని ఫిక్స్ కాలేదన్నాడు. రాయుడి రిటైర్మెంట్‌కు పరోక్షంగా కోహ్లీనే కారణమని నెటిజన్లు అంటున్నారు.

కోహ్లీనే నాశనం చేసాడు:

'రాయుడి రిటైర్మెంట్‌కు కోహ్లీనే కారణమని, కోహ్లీ రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే బాగుండేదని' ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. 'ప్రతిభ ఉన్న ఆటగాడిని పక్కన పెట్టేశారని' మరో నెటిజన్ ఆరోపించాడు. 'తనకు భజన చేసే క్రికెటర్లను మాత్రమే కోహ్లీ ప్రోత్సహిస్తాడని.. అశ్విన్‌, జడేజా, రాయుడు కెరీర్‌ను కోహ్లీనే నాశనం చేశాడని.. ఆర్సీబీలో ఆడుతున్నందుకే చాహల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు అవకాశాలు కల్పిస్తున్నాడని' ఓ నెటిజన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

రెండోసారీ నిరాశే:

రెండోసారీ నిరాశే:

ప్రపంచకప్‌ జట్టు ఎంపికలో మొదటి నుంచీ స్థానం ఆశించిన రాయుడుని కాదని సెలెక్టర్లు విజయ్‌ శంకర్‌ని ఎంపిక చేశారు. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కె ప్రసాద్‌ అందుకు వివరణ ఇచ్చిన తర్వాత రాయుడిని రెండో స్టాండ్‌బై ఆటగాడిగా ప్రకటించారు. తొలుత శిఖర్‌ ధావన్‌ గాయం నుంచి తప్పుకోగా అతడికి బదులు రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేశారు. అనంతరం విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. అతడి స్థానంలో యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రెండోసారీ కూడా రాయుడికి నిరాశే ఎదురైంది. ఇక అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఆ ట్వీటే కారణమా:

ఆ ట్వీటే కారణమా:

అయితే సెలెక్టర్లు ప్రపంచకప్‌ జట్టులో అతడిని ఎంపిక చేయకపోవడం వెనుక రాయుడు చేసిన ట్వీటే కారణమని అంతా భావిస్తున్నారు. తొలిసారి ప్రపంచకప్‌ జట్టుని ఎంపిక చేసినప్పుడు తనని కాదని విజయ్‌ శంకర్‌ని ఎంపిక చేయడం పట్ల రాయుడు వివాదాస్పద ట్వీట్‌ (3డి గ్లాస్ ట్వీట్) చేసిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, July 4, 2019, 13:18 [IST]
Other articles published on Jul 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+