Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: బీసీసీఐ చెత్త నిర్ణయం.. సీఎస్కే, ముంబయికి శాపం!!

ఐపీఎల్ 2025లో అగ్ర జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ.. విమర్శలను అందుకుంటున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడి పాయింట్ల పట్టికలో 8,9 స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్.. ఈ రెండు బడా జట్లు ఇలాంటి చెత్త ప్రదర్శన చేయడానికి, బలహీనపడటానికి కారణం బీసీసీఐ అంటూ నిందిస్తున్నారు. అందుకు గల కారణాలు వివరిస్తున్నారు.

గత ఐదేళ్లలో ప్రదర్శన..
సీఎస్కే, ముంబయి.. లీగ్ చరిత్రలో చెరో ఐదు టైటిళ్లతో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్లుగా కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో(2021,2023)సీఎస్కే రెండు ట్రోఫీలను ముద్దాడగా.. ముంబయి ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. చివరిసారిగా 2020లో విజేతగా నిలిచింది. ఇక 2021 నుంచి చూస్తే ఆ సీజన్ లో సీఎస్కే టైటిల్ సాధిస్తే.. ముంబయి ఇండియన్స్ ఐదో స్థానంలో ఉండి, ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేదు. 2022లో మరో రెండు కొత్త జట్లు రావడంతో మొత్తం 10 అయ్యాయి. ఆ సీజన్ లో సీఎస్కే 9, ముంబయి 10వ స్థానంలో నిలిచాయి. 2023లో మళ్లీ సీఎస్కే గెలవగా, ముంబయి ప్లే ఆఫ్స్ కు చేరి, నాలుగో స్థానంతో ముగించింది. 2024లో సీఎస్కే, ముంబయి 5,10 స్థానాల్లో నిలిచారు. అంటే ముంబయి గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్ చేరింది.

Fans are blaming BCCI for CSK and Mumbai indians poor performance in IPL 2025


బలహీనపడటానికి అదే కారణం..
అయితే సీఎస్కే, ముంబయి బలమైన జట్లు అయినప్పటికీ.. ఈ సీజన్‌లో ఆ జట్లు నిరాశపరచడానికి బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ మెగా ఆక్షన్ నిర్వహించడం ఓ కారణమని చెబుతున్నారు. పైగా, రెండు కొత్త జట్లను(లక్నో, గుజరాత్) చేర్చడం కూడా మరో కారణమని అంటున్నారు. "ఈ మెగా వేలం.. సీఎస్కే, ముంబయి జట్లపై కాస్త ప్రభావం చూపుతుంది. అప్పటివరకు తమకు కావాల్సిన పలువురు ప్లేయర్లు, ట్రైన్ చేసిన బలమైన ప్లేయర్లు.. వేలంలో మరో జట్టుకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈ రెండు జట్లలోని కీలక ఆటగాళ్ల కూడా.. ఇతర జట్లకు వెళ్లిపోతున్నారు. ఇక రెండు కొత్త జట్లను చేర్చడం వల్ల ప్రతిభావంతులైన ప్లేయర్లను కొనుగోలు చేయడంలోనూ కొరత ఏర్పడుతోంది. ఫైనల్ గా బీసీసీఐనే.. సీఎస్కే, ముంబయి ఇండియన్స్ జట్లను బలహీనులుగా మార్చింది" అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

సీఎస్కే, ముంబయిదే తప్పు..
"అన్ని జట్లకు ఒకే ఆక్షన్ ప్రక్రియ ఉంది. ఎలాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలో ముంబయి, సీఎస్కేకు తెలీయలేదు. అది వాళ్ల తప్పు.. ఎప్పుడు సీఎస్కే, ముంబయినే గెలిస్తే ఇతర జట్లు అభిమానులు నిరాశ చెందుతారు, కాబట్టి మెగా ఆక్షన్ అనేది సరైన నిర్ణయం" అని మరికొంతమంది బీసీసీఐకి సపోర్ట్ చేస్తున్నారు. అలానే ఈ మెగా ఆక్షన్ వల్ల.. స్టార్ ప్లేయర్లు, బలమైన ఆటగాళ్లు పది జట్లకు అవసరమైన మోతాదులో సమానంగా అందుబాటులో ఉంటారని బీసీసీఐ ఆలోచన. దీని వల్ల ఏ జట్టుకు అన్యాయం జరగకుండా ఉంటుందని యోచన.

మరికొంతమంది.. "గత మెగా ఆక్షన్‌లో సీఎస్కే, ముంబయి కొన్ని తప్పిదాలు చేశాయి. సరైన ఆటగాళ్లను తీసుకోలేదు. పైగా ముంబయి రోహిత్‌ను కాదని హార్దిక్‌కు పగ్గాలు అప్పజెప్పడం ఏమాత్రం ఉపయోగపడలేదు. అలానే సీఎస్కే.. మొదట సారథిగా నియమించిన జడేజా, ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సరిగ్గా జట్టును నడిపించలేకపోతున్నారు. కానీ ఇతర జట్ల కొత్త సారథులు మాత్రం బానే రాణిస్తున్నారు." అని అంటున్నారు.

Story first published: Thursday, April 10, 2025, 13:34 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+