INDvsNZ: సంజూనే బలిపశువా?.. టీమిండియాపై మండిపడుతున్న ఫ్యాన్స్!

న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడింది. కేవలం ఐదుగురు బౌలర్లతోనే బరిలో దిగిన భారత్.. ఎక్స్‌ట్రా బౌలర్ లేకపోవడంతో చేతులెత్తేసింది. దీంతో రెండో మ్యాచ్‌లో కచ్చితంగా దీపక్ హుడాను ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుంది. ఫామ్‌లో లేని రిషభ్ పంత్, వన్డేల్లో ఆకట్టుకోని సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని తీసేసి హుడాను ఆడించే అవకాశం ఉంది. అయినా సరే మేనేజ్‌మెంట్ మాత్రం సంజూ శాంసన్‌పై వేటు వేసింది.

ఫామ్‌లో సంజూ..
ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో సంజూ చక్కగా రాణించాడు. అయినా అతనికి టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. చివరకు వన్డేలో ఒకే ఒక అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన సంజూ.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ రెండో వన్డేలో అతనికి జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో హుడాను ఆడిస్తున్నట్లు టాస్ సమయంలో ధవన్ వెల్లడించాడు. ఈ వార్త అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. జట్టులో ఎవరు ఆడకపోయినా మేనేజ్‌మెంట్ మాత్రం సంజూనే బలిపశువును చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పంత్ కోసం సంజూ కెరీర్ నాశనం..
నిలకడగా రాణిస్తున్న అతనికి సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందిపోయి, ఇలా సంజూ కెరీర్ నాశనం చేస్తున్నారని మండి పడుతున్నారు. ఎంత చెత్తగా ఆడుతున్నా రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లను కొనసాగిస్తున్నారని, వాళ్లకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు తనకు దక్కిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్న సంజూ.. ఈ ఏడాదిలో దాదాపుగా తను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు.
ఐర్లాండ్‌పై అద్భుంగా ఆడాడు. కానీ అతనికి భారత జట్టులో చోటు మాత్రం దక్కలేదు. పేలవ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్ స్థానంలో కనీసం పొట్టి ఫార్మాట్‌లో అయినా సంజూకు అవకాశాలు దక్కుతాయని ఫ్యాన్స్ అనుకున్నారు. టీం మేనేజ్‌మెంట్ మాత్రం ఎంత దారుణంగా విఫలమవుతున్నా పంత్‌ను ఆడిస్తూనే ఉంది.

దారుణంగా కుట్రలు..
టాపార్డర్ బ్యాటర్ అయిన సంజూనే తీసుకొచ్చి ఫినిషర్ రోల్ ఇచ్చింది. అక్కడ అతను విఫలమైతే జట్టులో నుంచి తీసేయాలని అనుకుంది. అక్కడ కూడా సంజూ రాణించడంతో ఏదో ఒక చెత్త కారణం చూపించి అతన్ని జట్టులో నుంచి తీసేస్తోంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. అయితే అసలు సెలెక్ట్ చెయ్యరు. ఒకవేళ సెలెక్ట్ చేస్తే బెంచ్‌కే పరిమితం చేస్తారు. అలాంటప్పుడు ఇక సంజూకు అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయని ప్రశ్నిస్తున్నారు. మరి టీం మేనేజ్‌మెంట్ ఈ విషయంల నిష్పక్షపాతంగా వ్యవహరించి సంజూకు మరిన్ని అవకాశాలు ఇస్తుందేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications