Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : నోబాల్‌కు లబుషేన్ వికెట్.. టీమిండియా కొంప ముంచిన జడ్డూ..!

Fans angry on Jadeja for bowling no-ball to Labushchagne

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తడబడుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం టీమిండియానే దెబ్బతీసింది. పిచ్ నుంచి బౌలర్లకు అద్భుతంగా సహకారం అందడంతో భారత బ్యాటింగ్ విభాగం బెంబేలెత్తింది. తొలి ఓవర్లోనే రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న కెప్టెన్ రోహిత్ (12) దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. అలాగే మిగతా ఆటగాళ్లు కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు.

ఆసీస్ ఛేజ్ కూడా..

మిడిలార్డర్‌లో కోహ్లీ (22) కాసేపు క్రీజులో ఉన్నా కూడా తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అయితే టీమిండియాలో అతనే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. మొత్తానికి ఆసీస్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (9)ని జడేజా త్వరగానే అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా లబుషేన్, ఖవాజా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలో లక్ష్యం దిశగా సాగుతున్న ఈ జోడీని విడదీసే అవకాశం జడ్డూకు వచ్చింది. కానీ అతని చెడ్డ అలవాటు వల్ల ఆసీస్ బతికిపోయింది.

జడ్డూ చెడ్డ అలవాటు..

జడ్డూ చెడ్డ అలవాటు..

జడేజా వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు లబుషేన్ ప్రయత్నించాడు. అయితే ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. ఇది చూసిన భారత శిబిరం సంబరాల్లో మునిగింది. తీరాచూస్తే జడ్డూ నోబాల్ వేసినట్లు తేలింది. ఇది చూసిన అభిమానులు మండిపడ్డారు.

ఇదే సిరీసులో అంతకుముందు కూడా జడ్డూ ఇలాగే చేశాడు. సరిగ్గా వికెట్ పడిన బంతికే నోబాల్ వేశాడు. జడ్డే వేసిన నోబాల్‌తో బతికిపోయిన మార్నస్ లబుషేన్ నెమ్మదిగా తన ఇన్నింగ్స్ నిర్మించుకోవడం చూసే కొద్దీ భారత అభిమానులకు ఒంటికి కారం పూసినట్లు మండుతోంది. దీనిపై ప్రముఖ కామెంటేటర్ హర్షభోగ్లే కూడా ట్వీట్ చేశాడు.

జడ్డూపై ఫ్యాన్స్‌ ఆగ్రహం

జడ్డూపై ఫ్యాన్స్‌ ఆగ్రహం

'ఎవరైనా సరే నోబాల్ వేయడం హర్షనీయం కాదు. మరీ ముఖ్యంగా స్పిన్నర్ అయితే క్షమార్హం కాదు. జడేజా అద్భుతమైన క్రికెటర్. కానీ ఈ నోబాల్ ఇన్‌ఫెక్షన్ పోవడానికి మాత్రం అతనికి చాలా టైం పట్టేలా ఉంది' అని కామెంట్ చేశాడు.

అభిమానులు కూడా ఇలా జడ్డూ నోబాల్ వేయడంపై తమ అసహనాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. సరైన టైంలో ఇలా నోబాల్ వేసి ప్రత్యర్థికి జీవనదానం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ నోబాల్ భారత్‌కు ఎన్ని కష్టాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

Story first published: Wednesday, March 1, 2023, 14:57 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+