Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే నా ఆఖరి టెస్టు, కుంబ్లే పట్ల గౌరవం: తేల్చేసిన అశ్విన్

హైదరాబాద్: టెస్టుల్లో భారత్ జట్టు తరుపున సాధ్యమైనన్ని వికెట్లు తీస్తానని, అయితే స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డుని మాత్రం అందుకోబోనని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో కుంబ్లే కుంబ్లే సాధించిన 619 వికెట్ల రికార్డుకు ఒక వికెట్‌ తక్కువగా సాధించే వీడ్కోలు పలుకుతానని అన్నాడు.

జనరేషన్‌ నెక్స్‌ట్‌ పేరుతో అశ్విన్‌ తన సొంత అకాడమీని దుబాయిలో శుక్రవారం ప్రారంభించాడు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ 'నేను అనిల్ కుంబ్లేకి వీరాభిమానిని. అతడు టెస్టుల్లో 619 వికెట్లు చేశాడు. నా ఆట బాగుండి, అదృష్టవశాత్తూ నేను అంత దూరం వెళ్లగలిగితే సంతోషం' అని అశ్విన్ అన్నాడు.

'కానీ నేను 618 వికెట్లు తీశానంటే అదే నా ఆఖరి టెస్టు అవుతుంది. ఆపై మరో వికెట్‌ కూడా తీయను. 619వ వికెట్‌ తీయాలని, కుంబ్లే రికార్డు బద్దలుకొట్టాలని మాత్రం ఆలోచించను. ఇదే అతనికి నేను ఇచ్చే గౌరవం. కుంబ్లే అంత గొప్ప ఆటగాడు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు' అని అశ్విన్‌ తెలిపాడు.

మూడో స్ధానంలో అనిల్ కుంబ్లే

మూడో స్ధానంలో అనిల్ కుంబ్లే

కుంబ్లేపై తనకున్న గౌరవాన్ని ఈ సందర్భంగా అశ్విన్ ప్రదర్శించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే మూడో స్ధానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్ అగ్రస్ధానంలొ కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్ధానంలో ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ ఉన్నాడు.

టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో

టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో

2016లో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితులైన సమయంలో అతడితో కలిసి పని చేసే అవకాశాన్ని అశ్విన్ సొంతం చేసుకున్నాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో అశ్విన్‌కు ఎన్నో ఉపయోగకరమైన టిప్స్‌ను సైతం తెలియజేశాడు.

52 టెస్టులాడిన ఆశ్విన్ 292 వికెట్లు

52 టెస్టులాడిన ఆశ్విన్ 292 వికెట్లు

31 ఏళ్ల అశ్విన్‌ ఇప్పటి వరకు భారత్ తరుపున 52 టెస్టుల్లో 292 వికెట్లు తీశాడు. తమ అభిమాని క్రికెటర్ల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 1998లో పాకిస్తాన్‌తో పెషావర్‌లో జరిగిన టెస్టులో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ కూడా బ్రాడ్‌మన్‌ పట్ల ఇలాంటి గౌరవాన్నే చూపించాడు.

గతంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ కూడా

గతంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ కూడా

ఆ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 334 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్‌ టేలర్‌... తాను బ్రాడ్‌మన్‌ అత్యధిక స్కోరు (334)ను అందుకోవడమే గొప్ప అని, దానిని దాటలేనంటూ మూడో రోజు క్రీజులోకి రాకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి ఆశ్చర్యపరిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+