Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చంపేశావ్.. ఫంక్షన్ ఎప్పుడు.. ??: క్రిస్ గేల్

Chris Gayle Gives An Epic Reply To His Fan
Fan tries to copy Chris Gayle dance; gets trolled heavily in the process

హైదరాబాద్: క్రికెట్ రంగంలో వెస్టిండీస్ ఆటగాళ్లు పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. వాళ్లు ఎక్కడుంటే అక్కడ సందడి నెలకొంటుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన గేల్ సీజన్ ఆరంభంలో మంచి దూకుడు చూపించాడు. తర్వాత సీజన్ మధ్యలోనే విరామం కోసం కేరళ వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఇదే సమయంలో గేల్ హర్యానా ప్రాంతంలో స్థానికంగా చేసే 'తేరీ అంఖ్యా కా యో కాజల్' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఇంతకీ హర్యానా పాటగా ఫేమస్ అయిన ఈ పాట ఒరిజినల్ సాంగ్‌లో సన్నీ లియోన్ డాన్స్ చేసింది. దాన్ని ఆడియో మార్చి హర్యానా పాటగా చిత్రీకరించారు. ఐతే ఇప్పుడు అదే పాటకు గేల్ భారత అభిమాని ఒకరు డ్యాన్స్ చేసి వీడియో పోస్టు చేశాడు. తాజాగా భారత్‌కు చెందిన విక్కీ కుమార్‌ ట్విటర్లో డ్యాన్స్‌ చేస్తున్న ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇందులో గేల్‌ ఓ సందర్భంలో వేసిన డ్యాన్స్‌ను విక్కీ అలాగే వేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోను విక్కీ.. గేల్‌కు ట్యాగ్‌ చేశాడు.

సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే గేల్‌ ఈ వీడియోను చూసి 'చంపేశావ్' అని సరదాగా కామెంట్‌ పెట్టాడు. అంతేకాదు దాంతోపాటు 'ఫంక్షన్ ఎప్పుడు' అని కూడా చమత్కరించాడు. గేల్ చేసిన కామెంట్ పొగుడుతున్నట్లు ఉన్నా.. కౌంటర్ వేసినట్లుగానూ అనిపిస్తుంది. దీంతో ఆ అభిమాని అయోమయానికి గురైయ్యాడు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్ తరఫున ఆడిన గేల్‌ 11 మ్యాచ్ల్లో 368 పరుగులు చేశాడు.

టోర్నీ ఆరంభంలో బాగా ఆడిన పంజాబ్‌ ఆ తర్వాత పరాజయాలు పాలవ్వడంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నెలాఖరులో కెనడాలో జరగబోయే గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడేందుకు గేల్‌ సిద్ధమవుతున్నాడు. ఇదే లీగ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు వార్నర్‌, స్మిత్‌ కూడా ఆడుతున్నారు.

Story first published: Wednesday, June 6, 2018, 9:55 [IST]
Other articles published on Jun 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+