Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR VS RCB: 17 గంటలు కోహ్లీ కోసమే.. కాళ్లు లేకపోయినా 500కి.మీ జర్నీ చేసి..!

RR VS RCB: ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు బడా జట్లు బోల్తా కొడుతుంటే.. మరోవైపు అంచనాలు లేని జట్లు బిగ్ స్కోరింగ్ చేస్తూ సమ్మర్ లో మరింత హీట్ పెంచుతున్నాయి. ఒకదాన్ని మించి మరోక జట్టు.. తమ ప్రదర్శనలతో థ్రిల్లింగ్ మ్యాచులుగా మలుస్తున్నాయి. ఇప్పుడీ ఉత్కంఠతను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేందుకు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ హోమ్ గ్రౌండ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రెండు జట్లు కూడా పట్టిష్టంగానే కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌ జట్టుకు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. కానీ సాలిడ్ బ్యాటింగ్ లైనప్, మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఆర్సీబీ టీమ్ లో ఉన్నారు.

17 గంటల పాటు కోహ్లీ కోసమే..
అయితే ఈ మ్యాచు చేసేందుకు స్టేడియం వద్దకు భారీగా ప్రేక్షకులు చేరుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కోసమే ఎక్కువ సంఖ్యలో ఆడియెన్స్ మైదానానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టేడియం దగ్గరికి వెళ్లి పలువురు ప్రేక్షకులను పలకరించగా.. పలువురు అభిమానులు ఆసక్తికర విషయాలను చెప్పారు. విరాట్ కోహ్లీ కోసం 17 గంటల పాటు లైన్ లోనే నిలబడి టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని బట్టి మరోసారి విరాట్ కోహ్లీ క్రేజ్ ఏంటో నిరూపితమైంది. "రాజస్థాన్ జైపుర్ మాది. కానీ మేం ఆర్సీబీ అభిమానులం. విరాట్ కోహ్లీకి విరాభీమానులం. కేవలం అతడి కోసమే వచ్చాం. ఆర్సీబీనే గెలుస్తుంది. కోహ్లీ సెంచరీ చేస్తాడు. ఈ సారి ఆర్సీబీ కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుంది. 17 గంటల పాటు లైన్ లో నిలబటి ఈ మ్యాచ్ టికెట్ కొనుగోలు చేశాం." అని ఓ అభిమానుల బృందం తెలిపింది.

Fan stood in line for 17 hours to watch Virat Kohli for rr vs rcb live match IPL 2025

కాళ్లు లేకపోయినా 500 కి.మీ జర్నీ..
మరి కొంతమంది అభిమానులను పలకరించగా.. వారిలో ఇద్దరు దివ్యాంగులు కూడా ఉన్నారు. వారు మాట్లాడుతూ.. "500 కి.మీ దూరం నుంచి వచ్చాం. విరాట్ కోహ్లీ ఉన్నా కూడా.. రాజస్థాన్ జట్టుకే మా సపోర్ట్. ఇతర మ్యాచులు కూడా స్టేడియానికి వెళ్లి చూస్తాం. సంజూ శాంసన్, రియాన్ పరాగ్ మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాం." అని ఇద్దరు దివ్యాంగులు తమ సపోర్ట్ ను ఆర్ఆర్ జట్టుకు ఇచ్చారు.

Story first published: Sunday, April 13, 2025, 15:05 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+