హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన తర్వాత సచిన్‌కు అభిమానులు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఇటీవలే ఇద్దరు చిన్నారులు సచిన్‌కి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. తాజాగా సచిన్ టెండూల్కర్‌కి ఓ అభిమాని ట్విటర్ ద్వారా లేఖ రాశాడు. ఈ లేఖకు సచిన్ కూడా స్పందించడం విశేషం.
'డియర్ సార్.. నా పేరు సుజన. యువతకు మీరే ఆదర్శం. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను.. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్. మీలాంటి గొప్ప క్రికెటర్‌ని చూసి ఎంతో మేమెంతో గర్వంగా ఫీలవుతున్నాం. 24 ఏళ్ల పాటు క్రికెటర్‌గా దేశానికి ప్రాతినిథ్యం వహించడం చాలా కష్టం. పని పట్ల మీకు ఉన్న విధేయత, భక్తి, కష్టపడేతత్వంతోనే ఇది సాధ్యమైంది. మీరు 'గాడ్ ఆఫ్ క్రికెట్'. ఈ మధ్యే ఓ టీవీ షోలో మీ ఇంటర్వ్యూ చూశాను. 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' చిత్రాన్ని చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. మీ ఆటోగ్రాఫ్ పంపిస్తే సంతోషిస్తాను' అని పేర్కొన్నారు.
అభిమాని లేఖను సచిన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసి అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 'సుజన మీ లేఖకు ఎంతో సంతోషం. సచిన్ సినిమా చూసి మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను' అని సచిన్ పేర్కొన్నాడు.