For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడియో వైరల్: భారీ షాట్‌తో స్టేడియం బయట పడిన బంతి.. ఎత్తుకెళ్లిపోయిన ఫ్యాన్!

Fan runs away with cricket ball during match video goes viral

టీ20 క్రికెట్ అంటేనే భారీ షాట్లు. మైదానంలోకి వచ్చిన ప్రతి బ్యాటరూ బంతిని బౌండరీ ఆవలకు పంపేందుకే ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు మరీ గట్టిగా బంతిని బాదడంతో అది స్టేడియం ఆవల పడే అవకాశమూ ఉంటుంది. తాజాగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో కూడా అదే జరిగింది. ఎంఐ ఎమిరేట్స్, డిజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ జట్టు ఏకంగా 241 పరుగులు చేసింది.

ఎమిరేట్స్ ఆటగాళ్లలో ఆండ్రీ ఫ్లెచర్, ముహమ్మద్ వసీం, కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముగ్గురూ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇన్నింగ్స్ చివర్లో డాన్ మూస్లీ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను కొట్టిన ఒక భారీ సిక్సర్‌లో.. బంతి షార్జా స్టేడియం బయట పడింది. ఇలా పడటం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

అయితే ఆ బంతి ఏమవుతుందో తెలియదు. ఈ మ్యాచ్‌ సమయంలో మాత్రం ఇలా స్టేడియం బయట పడిన బంతిని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకున్నాడు. మళ్లీ స్టేడియంలోకి రాకుండా పరుగు తీశాడు. మళ్లీ దాన్ని తిరిగి ఇచ్చిందీ లేనిదీ ఎవరికీ తెలియదు.

అలాగే ఆ తర్వాత కీరన్ పొలార్డ్ కూడా భారీ సిక్సర్ బాదాడు. అప్పుడు కూడా బంతి స్టేడియం బయట పడింది. అయితే ఈసారి మాత్రం అటుగా వెళ్లిన ఒక వ్యక్తి బంతిని తీసుకొచ్చి ఇచ్చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన ఎమిరేట్స్ జట్టు.. బౌలింగ్ కూడా చక్కగా చేయడంతో విజయం ఆ జట్టునే వరించింది. ఇలా బంతిని అభిమాని ఎత్తుకుపోయిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Tuesday, January 31, 2023, 16:24 [IST]
Other articles published on Jan 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+