Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli Century: 'అమ్మోరు పూనినట్లు ఊగిపోయిన అభిమాని.. బెదిరిపోయిన బామ్మ'!(వీడియో వైరల్)

ఛాంపియన్స్‌ ట్రోఫీలో దాయాది పాకిస్థాన్‌పై సెంచరీ బాది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత కొంతకాలంగా ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న అతడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో శతకం సాధించడం వల్ల అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్ సెంచరీ బాదడంతో ఓ ఫ్యాన్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు సంతోషంతో ఇల్లు పీకి పందిరి వేసినంత రచ్చ రచ్చ చేశాడు. పూనకం వచ్చినోడిలా ఊగిపోయాడు. మీరు ఓ సారి దాన్ని చూసేయండి..

ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియాలో విరాట్ కోహ్లీపై అభిమానులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అతడు ఫామ్ లోకి వచ్చి అదిరే ప్రదర్శన చేయాలని అంతా ఆశించారు. కానీ అతడు న్యూజిలాండ్ పై ఆడిన తొలి మ్యాచ్ లో 38 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ సాయంతో కేవలం 22 పరుగులే చేశాడు. అనంతరం కీలకమైన పాకిస్థాన్ పై మాత్రం కాస్త స్లోగానే ఆడినప్పటికీ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పలువురు మాజీ క్రికెటర్లు కూడా అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Fan reaction goes viral on Virat Kohli century Vs Pakistan in champions trophy 2025

ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ కుర్రవాడు కోహ్లీ సెంచరీ బాదగానే గట్టిగా ఐ లవ్ యూ కోహ్లీ అంటూ అరుస్తూ ఇళ్లంతా పరిగెత్తాడు. ఆనందంతో పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. చొక్కా విపి అరుస్తూ రచ్చ రచ్చ చేశాడు. టీవీ ముందు పడుకుని విరాట్ కు సాష్టాంగ నమస్కారం చేశాడు. యస్ యస్ అంటూ చప్పట్లు కొడుతూ తనలో ఉన్న శక్తినంతా ఉపయోగించి అరుస్తూనే ఉన్నాడు. అతడి చర్యకు ఇంట్లో వాళ్లు కూడా కాస్త బెదిరిపోయినట్లు కూడా కనిపిచింది. ఇది చూసిన ఓ నెటిజన్.. 'ఆ కుర్రాడి ఒంట్లోకి అమ్మవారు పూనిందా అని పక్కనే ఉన్న బామ్మ అనుకుని ఉంటుంది' అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

Story first published: Tuesday, February 25, 2025, 12:46 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+