మ్యాచ్ మధ్యలో ఆకతాయి అభిమాని.. ధోనీ కోసం గ్రౌండ్లోకి రాగా పోరా అని గెంటేసిన అంపైర్

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఒక సీఎస్కే అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇక సదరు అభిమాని భద్రత, నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్లోకి ప్రవేశించాడు. ఆ టైంలో బ్యాటింగ్ చేస్తున్న ధోనీని కలవాలనేది ఆ అభిమాని ఇంటెన్షన్. ఇక అప్పుడే పరుగు పూర్తి చేసి బౌలర్ ఎండ్ వైపు ఉన్న ధోనీని కలవడానికి ఆ అభిమాని గ్రౌండ్లోకి చొరబడి పరుగులు తీశాడు.

అంపైర్ చాకచక్యంగా అడ్డుకున్నాడు

అయితే ఆ అభిమానిని అంపైర్ క్రిస్ గఫానీ అడ్డుకున్నాడు. మ్యాచ్ జరుగుతుంది పోరా అంటూ గెంటేశాడు. అంతలో భద్రతా సిబ్బంది ఒకరు వచ్చి అతన్ని లాక్కెళ్లాడు. ఇక ధోనీ సైతం ఆ అభిమానిని చూస్తూ.. వెళ్లు స్టాండ్స్‌లోకి అంటూ సైగలు చేశాడు. సదరు అభిమానికి స్టేడియం నుంచి బయటకు పంపించడంతో పాటు అతనికి స్టేడియం నిర్వాహకులు ఫైన్ విధించారు. ధోనీ మీద అభిమానం వల్ల అలా చేశానని అతను చెప్పుకున్నా స్టేడియం నిర్వాహకులు రూల్స్ ప్రకారం అతనితో ప్రవర్తించారు. గతంలోనూ ధోనీని కలవడానికి గ్రౌండ్లోకి అభిమానులు వచ్చిన సంగతి తెలిసిందే.

కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ మార్జిన్‌తో ఓడిపోవడం వల్లే..

కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ మార్జిన్‌తో ఓడిపోవడం వల్లే..

ఇకపోతే ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ దఫా సీజన్లో అట్టడుగు నుంచి రెండో స్థానంలో తన ఆటను ముగించింది. 14గేమ్‌లలో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించి 8పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇక పోతే ఈ సీజన్ గురించి ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'మేము ఈ సీజన్లో కాస్త తడబడ్డాం.

మేము చాలా క్లోజ్ మ్యాచ్‌లు ఆడాం. కానీ చాలా తక్కువ మార్జిన్‌తో ఆ మ్యాచ్‌లలో ఓడిపోయాం. తద్వారా ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో లేకుండా పోయాం.' అని పేర్కొన్నాడు. ఇకపోతే కొత్త ప్లేయర్లతో కూడిన ప్రస్తుత జట్టు మునుపటి సీజన్ల మాదిరిగా ఆడటం సవాలుగా మారిందని తెలిపాడు. కొత్త ప్లేయర్లు తాము జట్టు కోసం ఏమి చేయగలరో అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. ఏదేమైన వచ్చే సీజన్లో మరింత పటిష్ఠంగా బరిలోకి దిగుతాం అని స్పష్టం చేశాడు.

అశ్విన్ దెబ్బకు చెన్నై దబేల్

అశ్విన్ దెబ్బకు చెన్నై దబేల్

ఇక నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 151పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌కు విధించింది. ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (59పరుగులు 44బంతుల్లో 8ఫోర్లు 1సిక్సర్) రాణించడంతో పాటు చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (40పరుగులు 23బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్) వీరోచితంగా పోరాడి రాజస్థాన్‌ను 5వికెట్ల తేడాతో గెలిపించాడు.

ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 18పాయింట్లతో 2వ స్థానంతో పాటు టాప్ 2బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. చెన్నై బౌలర్లలో సిమ్రాన్ జిత్ సింగ్ 1, మొయిన్ అలీ 1, సాంట్నర్ 1, ప్రశాంత్ సోలంకి 2 వికెట్లు తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 21, 2022, 16:50 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X