ప్రార్ధన చేశాం: కుల్దీప్ హ్యాట్రిక్ రికార్డుపై కుటుంబ సభ్యులు
హైదరాబాద్: కుల్దీప్ యాదవ్... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో వన్డే తర్వాత దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. అందుకు కారణం లేకపోలేదు. రెండో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లను తీయడం ద్వారా వన్డేల్లో భారత్ తరుపున హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు.
రెండో వన్డేలో ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ 32.2వ బంతికి మాథ్యూ వేడ్, 32.3వ బంతికి అగర్, 32.4వ బంతికి కమిన్స్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపడంతో కుల్దీప్ హ్యాట్రిక్ రికార్డు అందుకున్నాడు. కుల్దీప్ సాధించిన ఈ ఘనతపై కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

కుల్దీప్ సోదరి అనుష్క యాదవ్
ఈ సందర్భంగా కుల్దీప్ సోదరి అనుష్క యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సందర్భం కోసమే తామెంతా ఎదురు చూసినట్లు వెల్లడించింది. 'ఎంతో గర్వంగా ఉంది. నా సోదరుడు ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. కుటుంబం మొత్తం ఇలాంటి ప్రదర్శన కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది' అని అన్నారు.

కుల్దీప్ తల్లి ఉషా యాదవ్
'రెండో వన్డేలో కుల్దీప్ తొలుత సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయినప్పటికీ, ఈ రోజు ఏదో సాధిస్తాడని తామంతా ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం' అని ఆమె తెలిపారు. ఇక కుల్దీప్ తల్లి ఉషా యాదవ్ కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. 'తల్లిగా ఎంతో గర్వించాల్సిన సమయమిది. ముందు వికెట్లు తీయకపోయేసరికి మధ్యమధ్యలో మ్యాచ్ చూడటం మానేసి.. ప్రార్థన చేశాను. ఆ తర్వాత కొద్దిసేపటికే హ్యాట్రిక్ సాధించాడు' అని ఆమె అన్నారు.

కుల్దీప్ తండ్రి రామ్ సింగ్
ఇక, కుల్దీప్ తండ్రి రామ్ సింగ్ తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోయాడు. 'మొదట్లో కొంచెం అసంతృప్తి చెందాను. అయితే చివరకు చాలా సంతోషించా. సాధారణంగా కుల్దీప్ వేసే తొలి 2-3 ఓవర్లలో ఫలితం అనుకూలంగా వచ్చేది. అయితే ఈరోజు మాత్రం చివరి వరకు పోరాడాడు' అని కుల్దీప్ తండ్రి రామ్ సింగ్ వెల్లడించారు.

కుల్దీప్ స్నేహితుడు
‘కీలక సమయంలో కుల్దీప్ హ్యాట్రిక్ వికెట్లు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో అండర్-19 యూత్ వన్డేలోనూ హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పుడు అంతర్జాతీయ వన్డేలో అది కూడా ఆస్ట్రేలియాపై మరోసారి హ్యాట్రిక్ సాధించడం చాలా గర్వంగా ఉంది' అని కుల్దీప్ చిన్ననాటి స్నేహితుడు జీషాన్ హజ్మా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications