Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆడపిల్లకు తండ్రిని కావడం ఎంతో గర్వంగా ఉంది'

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర వహించిన హర్మన్ ప్రీత్ కౌర్‌ పేరుని బీసీసీఐ అర్జున అవార్డుకి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. క్రీడా పురస్కారాల్లో ఒకటైన అర్జున అవార్డుకు తమ కుమార్తె పేరును ప్రతిపాదించడంపై ఆమె తండ్రి హర్మందర్ సింగ్ బుళ్లార్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆడపిల్లలు భారమని ఎందరో తల్లిదండ్రులు భావిస్తుంటారు కానీ ఆడపిల్లకు తండ్రిని కావడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కుమార్తెగా హర్మన్‌ప్రీత్‌ను అందించిన దేవుడికి రుణపడి ఉంటానన్నారు. తన కుమార్తె హర్మన్ ప్రీత్ పేరును అర్జున అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రభుత్వానికి, బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 Family of Harmanpreet feel proud on her selection for Arjuna Award

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన మహిళల వరల్డ్ కప్‌లో హర్మన్ ప్రీత్ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. భుజం గాయం బాధిస్తున్నప్పటికీ, ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో రాణించింది. హర్మన్ ప్రదర్శనకు గాను బీసీసీఐ ఆమె పేరుని అర్జున అవార్డుకి సిఫారసు చేసింది.

తెలుగు క్రీడాకారుల్లో వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌)లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. మొత్తం 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది.

అర్జున అవార్డుకు నామినేట్ అయిన వారు వీళ్లే:
వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), కుష్‌బీర్‌ కౌర్‌ (అథ్లెటిక్స్‌), అరోకిన్‌ రాజీవ్‌ (అథ్లెటిక్స్‌), ప్రశాంతి సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), దేవేంద్రో సింగ్‌ (బాక్సింగ్‌), పుజారా (క్రికెట్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (క్రికెట్‌), బెంబెమ్‌ దేవి (ఫుట్‌బాల్‌), ఎస్ఎస్పీ చౌరాసియా (గోల్ఫ్‌), ఎస్వీ సునీల్‌ (హాకీ), జస్వీర్‌ సింగ్‌ (కబడ్డీ), పీఎన్‌ ప్రకాశ్‌ (షూటింగ్‌), ఆంటోని అమల్‌రాజ్‌ (టీటీ), సత్యవర్త్‌ కడియన్‌ (రెజ్లింగ్‌), తంగవేలు (పారా అథ్లెట్‌), వరుణ్‌ బట్టి (పారా అథ్లెట్‌).

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+