IND VS PAK: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ - భారత్‌తో మ్యాచ్‌కు అతడు దూరం
స్వదేశంలో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీని ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్ కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్ తో ఆడిన ఆరంభ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఫకర్ జమాన్.. పాక్ జట్టు ఆడబోయే తదుపరి మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడు భారత్ తో జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు.
దీంతో ఫకర్ జమాన్‌కు ప్రత్యామ్నాయంగా ఇమామ్ ఉల్ హాక్ పేరును ప్రకటించింది పీసీబీ. ఫకర్ స్థానంలో అతడు బరిలోకి దిగుతాడని పేర్కొంది. మరి కేవలం భారత్ - పాక్ మ్యాచ్ కేనా లేదంటే పూర్తి ఛాంపియన్స్ ట్రోఫీకి ఫకర్ దూరమవుతున్నాడా అన్నది స్పష్టత ఇవ్వలేదు.

🚨 BIG SET-BACK FOR PAKISTAN 🚨
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
- Fakhar Zaman ruled out of the India game in Champions Trophy. [RevSportz] pic.twitter.com/09LY6WxO8z
గాయపడినప్పటికీ ఆడినా జమాన్..
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు ఫకర్ జమాన్. కానీ ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. రెగ్యులర్ ఓపెనింగ్ స్థానం కాకుండా నాలుగో స్థానంలోకి బరిలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూనే ఆడాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు.
రెండో మ్యాచ్ భారత్ తో..
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఘోర ఓటమిని అందుకుంది. ఫీల్డింగ్, బ్యాటింగ్ లో విఫలమై పరాజయం చెందింది. తొలి మ్యాచ్‌లోనే ఓటమితో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక తమ రెండో మ్యాచ్ ను టీమిండియాతో తలపడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications