Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీ చేస్తే చప్పట్లు కొట్టలేదు: ధోని తీరుపై ఫకార్ జమాన్ ఆవేదన

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేస్తే ధోని తనని అభినందించలేదని పాకిస్థాన్ యువ ఓపెనర్ ఫకార్ జమాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. జూన్ 18న భారత్‌తో ముగిసిన ఫైనల్లో 3.1వ ఓవర్లో బుమ్రా వేసిన నోబాల్‌ కారణంగా ఫకార్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్

3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్

ఈ సమయంలో ఫకార్ వ్యక్తిగత స్కోరు 3 పరుగులు. అయితే బుమ్రా నోబాల్‌తో బతికిపోయిన ఫకార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోని కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఫకార్ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 30.3 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌటైంది.

180 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం

180 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం

దీంతో భారత్పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ విజయం దక్కించుకుని ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 104 బంతుల్లో 114 పరుగులు చేసిన ఫకార్‌ జమాన్‌ పాకిస్థాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన కెరీర్‌లో జమాన్‌కి అదే తొలి సెంచరీ కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని పాకిస్థాన్ గెలవడం అదే మొదటిసారి.

ధోని కనీసం నన్ను పట్టించుకోలేదు

ధోని కనీసం నన్ను పట్టించుకోలేదు

తాను సెంచరీ సాధించిన సమయంలో ధోని నుంచి ఎలాంటి స్పందన లేదని జమాన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘నా సెంచరీ తర్వాత ధోని నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫైనల్లో నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అందరూ ఈ విషయాన్ని నాతో చెప్పారు. నేను 100 పరుగుల మైలురాయిని అందుకోగానే.. మైదానంలో అందరివైపు తేరిపారా చూశాను. ఆ సమయంలో తల దించుకుని ఉన్న కోహ్లీ అభినందపూర్వకంగా చప్పట్లు కొట్టడం నేను గమనించాను. కానీ ధోని కనీసం నన్ను పట్టించుకోలేదు' అని గుర్తు చేసుకున్నాడు.

కొత్త లైఫ్‌ దొరికినట్లు ఫీలయ్యా

కొత్త లైఫ్‌ దొరికినట్లు ఫీలయ్యా

అయితే బుమ్రా బౌలింగ్‌లో అవుటైనప్పుడు భారత ఆటగాళ్లు ఔట్‌కి అప్పీలు చేయడంతో గుండె జారినట్లు అనిపించిందని, తన కలలన్నీ ఆవిరయ్యాయని, తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్‌ రూం వైపు అడుగులు వేయడం మొదలు పెట్టానని అన్నారు. ఇంతలో అంపైర్‌ తన వద్దకు వచ్చి ఆగమని చెప్పడంతో ఆశలు చిగురించాయి. దీంతో కొత్త లైఫ్‌ దొరికినట్లు ఫీలైనా అని జమాన్‌ వివరించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+