For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10 ఓవర్లకు పాక్ స్కోర్ 38/1.. 500 సంగతేంటి సర్ఫరాజ్‌?

Fakhar falls to Saifuddin after scratchy start, Pakistan need a near-impossible win margin to qualify for the semis

ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు చాలా కీలకం. న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించి పాకిస్థాన్‌ సెమీస్‌ చేరాలంటే 312 పరుగుల తేడాతో భారీ విజయం సాదించాలి. అంతటి భారీ విజయం సాధించాలంటే ఆరంభమే అదిరేలా ఉండాలి. ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాలి. కానీ పాక్ అందుకు బిన్నంగా ఆడుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి ఓవర్ ఒకే పరుగు చేసిన పాక్.. రెండో ఓవర్ ముగిసే సరికి ఐదు పరుగులు చేసింది. ఇక ఎనిమిదో ఓవర్లో తొలి వికెట్‌ చేజార్చుకుంది. బంగ్లా పేసర్ సైఫుద్దీన్‌ వేసిన 7.2వ బంతికి ఓపెనర్ ఫకర్‌ జమాన్‌ (13; 31 బంతుల్లో 1×4) మెహదీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కీలక మ్యాచ్‌లో ఫకర్‌ జమాన్‌ 31 బంతులు ఆడి కేవలం 13 పగలే చేయడం విశేషం. 500 పరుగులు చేస్తాం. మ్యాచ్ గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాం అని మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పాక్ 500 కాదుకదా 300 కూడా చేసేలా లేదు.

1
43686

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి.. నాలుగు గెలిచి, మూడు ఓడిపోయింది. మరొక మ్యాచ్‌ రద్దైంది. దీంతో 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బంగ్లాపై గెలిచినా.. 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమానంగా ఉంటుంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ ఇప్పటికే కివీస్‌కు +0.175 ఉండడం, పాకిస్థాన్‌కు -0.792గా ఉండడంతో పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం చాలా తక్కువ.

{headtohead_cricket_5_10}

న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించి పాకిస్థాన్‌ సెమీస్‌ చేరాలంటే సంచలనం సృష్టించాల్సిందే. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. మొదటగా పాక్ 350 పరుగులు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను 311 పరుగుల తేడాతో ఓడించాలి. 400 పరుగులు చేసిన తర్వాత 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. ఇక 450 పరుగులు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను 321 పరుగుల తేడాతో ఓడించాలి.

Story first published: Friday, July 5, 2019, 16:14 [IST]
Other articles published on Jul 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+