అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి డుప్లెసిస్ గుడ్‌బై

కేప్‌టౌన్ : అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సాతాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సోమవారం ప్రకటించాడు. సౌతాఫ్రికా క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. క్వింటన్ డికాక్ ఆధ్వర్యంలో కొత్త నాయకులు రావడానికి తాను తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుందన్నాడు.

జట్టు మేలు కోసమే..

జట్టు మేలు కోసమే..

‘కొత్త టీమ్ హెడ్స్, యువ ఆటగాళ్ల‌తో జట్టు కొత్త దిశలో పయనిస్తున్నప్పుడు, అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకోవడం దక్షిణాఫ్రికా క్రికెట్ మంచిదని నేను భావించాను. ఇది చాలా కఠినమైన నిర్ణయమే. కానీ క్వింటన్ డికాక్‌కు, నా సహచర ఆటగాళ్లకు మద్దతుగా నిలబడటానికి నేను కట్టుబడి ఉన్నా. మేమంతా జట్టు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం.'అని డుప్లెసిస్ తెలిపాడు.

డివిలియర్స్ టీ20 వరల్డ్‌కప్ ఆడుతాడు : సౌతాఫ్రికా కోచ్

అందుకే కెప్టెన్‌గా కొనసాగా..

అందుకే కెప్టెన్‌గా కొనసాగా..

సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ నేపథ్యంలోనే వన్డే వరల్డ్‌కప్ తర్వాత తాను కెప్టెన్‌గా కొనసాగాల్సి వచ్చిందని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

‘సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్, కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళన‌తో జట్టు పునర్మిర్మాణ దశలో ఉండటంతో వన్డే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నా. గందరగోళంలో ఉన్న జట్టుకు అండగా నిలబడి భవిష్యత్తు తరం ఆటగాళ్లను గుర్తించడం ముఖ్యమని భావించా. గత సీజన్‌లో కెప్టెన్‌గా అనేక సవాళ్లను ఎదుర్కొన్నా. ఆఫ్ ఫీల్డ్ సమస్యలకే నాశక్తిని ధారపోయాల్సి వచ్చింది. 'అని తెలిపాడు.

సౌతాఫ్రికా కొత్త శకం

సౌతాఫ్రికా కొత్త శకం

ఇక సౌతాఫ్రికా క్రికెట్ కొత్త శకంలోకి అడుగుపెట్టిందన్నాడు. యువ ఆటగాళ్ల‌తో పాటు తాను మూడు ఫార్మాట్లలో ఆడేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. ‘సౌతాఫ్రికా క్రికెట్ ఓ కొత్త శకంలోకి అడుగుపెట్టింది. నూతన నాయకత్వం, కొత్త సవాళ్లు, సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లు, కొత్త కెప్టెన్ సారథ్యంలో మూడు ఫార్మాట్లు ఆడేందుకు ఓ ఆటగాడిగా నేను సిద్ధంగా ఉన్నా. అలాగే నా అనుభవంతో జట్టుకు అండగా నిలవాలనుకుంటున్నా.'అని పేర్కొన్నాడు.

ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్..

ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్..

తనకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన, మద్దుతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి డుప్లెసిస్ ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన, మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా భార్య, కూతురు, కుటుంబ సభ్యులు, సహచర ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్లు, సీఎస్ఏ బోర్డు, స్నేహితులు, ఫ్యాన్స్ ప్రతీ ఒక్కరు నాకు మద్దతుగా నిలిచారు. దేశానికి నాయకత్వం వహించడం జీవితంలోనే నాకు దక్కిన గొప్ప గౌరవం. 'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, February 17, 2020, 15:38 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X