
హైదరాబాద్: బ్రిటిష్ ఎయిర్‌వేస్ చేసిన పనికి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌కి విపరీతమైం కోపాన్ని తెప్పించింది. ఇంకేమంది తన కోపాన్ని ట్విట్టర్ వేదికగా వెళ్లగక్కాడు. ప్రస్తుతం సఫారీ జట్టు సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో కలిసేందుకు భారత్‌కు వస్తోన్న డుప్లెసిస్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది.
టీ20 సిరిస్ కోసం భారత్‌కు వచ్చే క్రమంలో డుప్లెసిస్ దుబాయిలో విమానాన్ని మిస్సయ్యాడు. దీంతో ఇది తన విమాన ప్రయాణాల్లో ఒక అత్యంత చెత్త అనుభవమని డుప్లెసిస్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "4 గంటల ఆలస్యం తర్వాత దుబాయి విమానంలో ఉన్నాను. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం బాగా ఆలస్యంగా వచ్చింది. దాంతో నేను భారత్‌కు వెళ్లే ఫ్లైట్‌ను దుబాయ్‌లో అందుకోలేకపోయాను" అని పేర్కొన్నాడు.
"జీవితం మీకు నిమ్మకాయలను ఇచ్చినప్పుడు, నిమ్మరసం చేయండి. నా క్రికెట్ బ్యాగ్ ఇంకా రాలేదు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ నిర్వాకానికి దుబాయ్ నుంచి భారత్ వెళ్లే విమానం మిస్ అయ్యాను. నాకు తదుపరి విమానం 10 గంటల తర్వాత ఉంది. నాకు ఇదొక చెత్త అనుభవం. నా విమాన ప్రయాణంలో ఏదీ సాఫీగా సాగలేదు" అని డుప్లెసిస్ ట్వీట్ చేశాడు.
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన డుప్లెసిస్ దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం మూడో టీ20లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దీంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై స్వదేశంలో టీమిండియా టీ20 సిరీస్‌ను గెలవని నేపథ్యంలో మూడో టీ20ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీ20 సిరిస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది. తొలి టెస్టు అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా జరగనుంది.