Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: చరిత్ర సృష్టించిన డుప్లెసిస్..క్రిస్ గేల్ రికార్డు బ్రేక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్.

ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2x4, 4x6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.

Duplesis

ఆర్సీబీ ఛేజింగ్‌లో డుప్లెసిస్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. అతను పవర్‌ప్లే అనంతరం కాసేపు క్రీజులో ఉంటే బెంగళూరు పది ఓవర్లలోనే విజయం సాధించేలా కనిపించింది. అంతలా అతను ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. డుప్లెసిస్‌ ధాటికి బెంగళూరు 3.1 ఓవర్లలోనే 50 స్కోరు సాధించింది. పవర్‌ప్లేలో 92 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోరు (92/1).

అంతేగాక ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ క్రమంలో అతను పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఆర్సీబీ తరఫున వేగవంతమైన హఫ్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా డుప్లెసిస్ రికార్డులకెక్కాడు.అగ్రస్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 17 బంతుల్లోనే 50 మార్క్‌ అందుకున్నాడు. గేల్, డుప్లెసిస్ తర్వాతి స్థానాల్లో రాబిన్ ఉతప్ప (19), రజత్ పటిదార్ (19) ఉన్నారు.

డుప్లెసిస్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పవర్‌ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆర్సీబీ బ్యాటర్‌గా డుప్లెసిస్ (64) చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు గేల్ (50) పేరిట ఉండేది. పవర్‌ప్లేలో గేల్ మూడు సార్లు 50 పరుగులు సాధించాడు.

Story first published: Saturday, May 4, 2024, 23:31 [IST]
Other articles published on May 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+