నన్ను, నా భార్యను చంపేస్తామన్నారు.. కారణం డివిలియర్స్: డుప్లెసిస్

కేప్‌టౌన్: 2011 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించినపుడు.. తనకు, తన భార్యకు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. తనపై వచ్చిన బెదిరింపులకు అసలు కారణం సహచర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అట. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫాఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం 36 ఏళ్ల డుప్లెసిస్ దక్షిణాఫ్రికా తరఫున ఆడుతుండగా.. 37 ఏళ్ల డివిలియర్స్ 2018లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు.

డివిలియర్స్ రనౌట్:
2011 ప్రపంచకప్‌లో భాగంగా ఢాకా వేదికగా మూడవ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడింది. డేనియల్ వెటోరి నేతృత్వంలోని న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. జెస్సీ రైడర్ 83 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దక్షిణాఫ్రికా స్కోరు 121-4గా ఉన్న సమయంలో ఫాఫ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సమన్వయ లోపం కారణంగా డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. ఫాఫ్ 36 పరుగులు చేశాడు. స్వల్ప స్కోరును ఛేజింగ్ చేయలేక దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది.

చంపేస్తామని బెదిరించారు:
తాజాగా ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫాఫ్ డుప్లెసిస్ తనపై వచ్చిన బెదిరింపుల గురించి చెప్పాడు. 'ఆ మ్యాచ్ ఓడిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నా మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. నన్ను, నా భార్యను చంపేస్తామని కొందరు బెదిరించారు. ఆ ఘటన చాలా వ్యక్తిగతంగా మారింది. చెప్పడానికి కూడా వీలులేనటువంటి మెసేజెస్ వచ్చాయి. చాలా బాధేసింది. అది ఆటపై కూడా ప్రభావం చూపింది. అయితే జట్టులో నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను' అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచులో కైల్ మిల్స్‌ను నెట్టివేసినందుకు డుప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా పడింది.

డుప్లెసిస్‌కు నిరాశే:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. మెగా టోర్నీలో ఫాఫ్ పరుగుల వరద పారించాడు. ఆడిన 7 మ్యాచుల్లో 136 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుత ఆరంభాలు ఇచ్చాడు. అయితే వెస్టిండీస్ టూర్ కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా మంగళవారం ప్రకటించిన టెస్ట్, టీ20 జట్లలో అతడికి చోటు దక్కలేదు. ఐపీఎల్ స్టార్లు డికాక్, ఎంగిడి, నోర్జ్, రబడా రెండు జట్లలలో ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికా జట్టు త్వరలోనే వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఐదు టీ20 సిరీస్‌లను ఆడబోతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications