For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్ టీ20 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు: డుప్లెసిస్

India vs Australia 2018-2019 : Give Kohli Silent Treatment to Curb His Runs | Oneindia Telugu
Faf du Plessis to Retire From T20s After ICC World T20 in Australia

హైదరాబాద్: మరో రెండేళ్లలో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతానని సుధీర్ఘకాలంగా దక్షిణాఫ్రికా జట్టులో కొనసాగుతున్న ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం సఫారీ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. గోల్డ్ కోస్ట్ వేదికగా దక్షిణాప్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఏకైక టీ20 శనివారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది.

ఈ నేపథ్యంలో డుప్లెసిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "ఒక్కో ఫార్మాట్‌కు సరైన సమయంలోనే వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నా. మరో రెండేళ్లలో అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెబుతా" అని డుప్లెసిస్ అన్నాడు. 2020లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20కి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

"టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. టోర్నీకి చాలా సమయం కూడా లేదు. మేము తిరిగి పొట్టి ఫార్మాట్ కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. బహుశా ఇదే నా చివరి అంతర్జాతీయ పర్యటన అనుకుంటున్నా. గత రెండు, మూడేళ్ల నుంచి టీ20 జట్టులోకి ప్రతిభగల యవ ఆటగాళ్లను తీసుకొచ్చాం" అని దక్షిణాఫ్రికా కెప్టెన్ పేర్కొన్నాడు.

"వారికి అవకాశాలను ఇస్తూనే ఉన్నాం. ఆస్ట్రేలియాతో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా" అని డుప్లెసిస్ చెప్పాడు. 2020 అక్టోబర్ నెలలో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20కి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. ఈ వరల్డ్ కప్ నిర్వహించే సమయానికి డుప్లెసిస్ వయసు 36కు చేరుకుంటుంది. ఆసీస్‌తో అన్ని ఫార్మాట్లలో తలపడిన డుప్లెసిస్ 6 సెంచరీలు సాధించాడు.

Story first published: Friday, November 16, 2018, 13:53 [IST]
Other articles published on Nov 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+