
క్వింటన్ డికాక్:
దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గతకొంతకాలంగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో డికాక్ 16 మ్యాచ్‌లాడి 140.5 స్ట్రెక్‌రేట్‌తో 35.92 సగటుతో 503 పరుగులు చేశాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్‌తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 2న ప్రారంభమై అదే నెల 16తో ముగుస్తుంది. డికాక్ ప్రొటీస్ సారథిగా ఉండటంతో ఆ సిరీస్‌లో అతను ఆడటం తప్పనిసరి. దీంతో ఐపీఎల్‌కు డికాక్ రెండు వారాలపాటు దూరమవనున్నాడు. అతని స్థానంలో క్రిస్ లిన్ తుదిజట్టులోకి రావొచ్చు.

ఫాఫ్ డుప్లెసిస్:
ఫాఫ్ డుప్లెసిస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ముగింపు దశకు వచ్చినా జోరు తగ్గడం లేదు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతూ ఇటు ఐపీఎల్‌లో, అటు అంతర్జాతీయ కెరీర్‌లో పరుగుల వరద కొనసాగిస్తున్నాడు. 36 ఏళ్ల ఫాఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడు. ఐపీఎల్ 2020లో చెన్నై ఆశించినంతమేర రాణించలేకపోయినా డుప్లెసిస్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 2020 ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లాడి 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవడం చెన్నైకి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే.

కాగిసో రబాడ:
ప్రస్తుత తరంలో అత్యుత్తమ బౌలర్లలో కాగిసో రబాడ ఒకడు. ఈ విషయం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ.. గత రెండు సీజన్లలో 29 మ్యాచ్‌లడి 55 వికెట్లు తీశాడు. 2020లో ఢిల్లీ మొదటిసారిగా ఫైనల్‌కు రావడంలో రబాడది కీలకపాత్ర. ఈ సీజన్లో 17 మ్యాచ్‌లాడిన రబాడ క్లిష్టమైన ఓవర్లలో బౌలింగ్ చేసి 8.34 ఎకానమీతో 30 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ సిరీస్ కారణంగా ఐపీఎల్ 2021కు రబాడ రెండు వారాలపాటు దూరమవనున్నాడు.

అన్రిచ్ నోర్జ్:
ఈ కాలంలో వేగంగా బంతులేసేది దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జ్. 2020లో జరిగిన ఐపీఎల్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నోర్జ్ గంటకు 156.2 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. ఇదే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి. ఇంతకుముందు ఈ రికార్డు డేల్ స్టెయిన్ (154.4 కి.మీ) పేరిట ఉండేది. 2020లో జరిగిన ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన నోర్జ్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 16 మ్యాచ్‌లాడి 22 వికెట్లు పడగొట్టాడు.నోర్జ్ కూడా రెండు వారాలపాటు దూరమవనున్నాడు.

లుంగి ఎంగిడి:
లుంగి ఎంగిడి కూడా దక్షిణాఫ్రికా జట్టుకు ప్రధాన పేసర్. వైవిధ్య బంతులతో వికెట్లు పడగొట్టడం అతని శైలి. ఎంగిడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. 2020 ఐపీఎల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లడిన ఎంగిడి 10.43 ఎకానమీతో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ కారణంగానే ఇతని స్థానంలో సామ్ కరన్ అన్ని మ్యాచులు ఆడాడు. పాకిస్థాన్‌తో జరగనునన్న సిరీస్‌లో రాణిస్తే చెన్నై తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. ఇక శ్రీలంకతో మే నెలలో జరగనున్న టెస్ట్ సిరీస్ కారణంగా బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఎక్కువ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.


Click it and Unblock the Notifications












