
కెప్టెన్ ఎవరు?
మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోట్ల రూపాయలు వెచ్చించి పలువురు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే జట్టును నడిపించగల సరైన కెప్టెన్‌ను మాత్రం ఎంపిక చేయలేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉండనని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా వేలంలో తమ జట్టుకు సరైన కెప్టెన్‌ను కొనుగోలు చేయలేదని అభిమానులు వాపోతున్నారు. దీంతో ఈ సారి సీజన్‌లో బెంగళూరును నడిపించే నాయకుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు.
స్టార్ ఆటగాళ్లు
మెగా వేలంలో ఆర్సీబీ పలువురు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అదే సమయంలో అనామక ఆటగాళ్ల కోసం అనవసరంగా భారీ ధర చెల్లించారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. వేలంలో శ్రీలంక స్పిన్నర్ హసరంగ, టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. వీరిద్దరిని ఆ జట్టు అత్యధికంగా 10 కోట్ల 75 లక్షల రూపాయల చొప్పున దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ 7 కోట్ల 75 లక్షల రూపాయలకు, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లిసెస్‌ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
వికెట్ కీపర్లుగా
ఇక వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్‌ను 5 కోట్ల 50 లక్షల రూపాయలు, అనుజ్ రావత్ 3 కోట్ల 40 లక్షల రూపాయలకు, ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్‌ను 2 కోట్ల 40 లక్షలకు, షెర్ఫీన్ రూథర్‌ఫోర్డ్‌ను కోటి రూపాయలకు, మహీపాల్ లోమ్మెర్‌ను 95 లక్షలకు, సుయాష్ ప్రభుదేశాయి 30 లక్షలకు, అనీశ్వర్ గౌతమ్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ణు 80 లక్షలకు, ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ బెహ్రండోర్ఫ్‌ను 75 లక్షలకు, భారత యువ బౌలర్లు చమ మిలింద్ 25 లక్షలకు, ఆకాశ్ దీప్ 20 లక్షలకు దక్కించుకుంది.

ఎంత మందంటే?
మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఆర్సీబీలోని ఆటగాళ్ల సంఖ్య 18కి చేరుకుంటుంది.
వేలంలో మరో ఒకరిద్దరిని కొనుగోలు చేయాల్సి ఉంది.

కెప్టెన్ అతడనే
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఫాఫ్ డుప్లిసెస్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళురు కెప్టెన్‌గ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అతని కెప్టెన్సీ రికార్డు ఐపీఎల్‌లో అంతగా బాగాలేదు. లేదంటే గ్లెయిన్ మాక్స్‌వెల్‌ను కూడా కెప్టెన్‌ను చేయొచ్చు అంటున్నారు. విరాట్ కోహ్లీనే మళ్లీ కెప్టెన్సీ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్య లేకుండా జట్టును సమర్ధవంతంగా నడిపించే సరైన ఆటగాడిని వేలంలో కొనుగోలు చేయాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. అనవవరసంగా హసరంగ వంటి అనామక ఆటగాళ్లపై కోట్ల రూపాయలు కుమ్మరించారని మండపడుతున్నారు.


Click it and Unblock the Notifications
