దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా డుప్లెసిస్
హైదరాబాద్: ఇకపై దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మెట్లలో కెప్టెన్‌గా ఫా డుప్లెసిస్ వ్యవహరించనున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20 జట్లకు అతనిని కెప్టెన్‌గా నియమిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది.
గత ఆరేళ్లుగా వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏబీ డివిలియర్స్ గత నెలలో తప్పుకోవడంతో ఆ బాధ్యతలను బోర్డు టెస్టు కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్‌కు అప్పగించింది. 33 ఏళ్ల డుప్లెసిస్ అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

దక్షిణాఫ్రికా జట్టుకు హెడ్ కోచ్‌గా గిబ్సన్ బాధ్యతలు స్వీకరించన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోన్న తొలి జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి డివిలియర్స్ తప్పుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications