న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SAT20 : డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్.. సన్‌రైజర్స్ మరోసారి చిత్తు!

 Faf du Plesis takes a blinder against Sunrisers in SAT20

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆ దేశ మాజీ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా ఆడుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అందుకున్న క్యాచ్ నెట్టింట వైరల్ అవుతోంది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో డుప్లెసిస్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఫీల్డింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ అతను రాణించడంతో చివరకు జోబర్గ్ సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. సగం మందికిపైగా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 19వ ఓవర్లో వాన్ డర్ మెర్వ్ (4) క్రీజులో ఉండగా డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. వాన్ డర్ మెర్వ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతని షాట్‌లో టైమింగ్ మిస్ అయింది. దీంతో అతను అనుకున్న వైపు బంతి వెళ్లలేదు.

అయితే చాలా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతి లాంగాఫ్ వైపు వెళ్లింది. అప్పటికి థర్టీ యార్డ్ సర్కిల్‌లో ఉన్న డుప్లెసిస్ వేగంగా పరిగెడుతూ ముందుకు డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టేశాడు. ఆ క్యాచ్ చూసిన కామెంటేటర్లు, ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. వాన్ డర్ మెర్వ్ కూడా తన కళ్లను నమ్మలేకపోయాడు. చాలా చిరాగ్గా బ్యాటుతో నేలను బాది అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఆ తర్వాత ఛేజింగ్‌లో చూడా జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను డుప్లెసిస్ ఆదుకున్నాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టాడు. అతనికి డు ప్లాయ్ (47 నాటౌట్) కూడా మంచి సహకారం అందించాడు. దీంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

Story first published: Sunday, January 22, 2023, 12:15 [IST]
Other articles published on Jan 22, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X