IND vs SL 3rd ODI: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆడిన మూడింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. లంకేయులను 3-0 తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన చివరి మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లోనూ వార్ వన్‌సైడ్ అయింది.
ఈ జైత్రయాత్రకు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో బ్రేక్ వేశారు లంకేయులు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ భారత్‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. తొలి వన్డేను టై చేశారు. రెండో మ్యాచ్‌లో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత్‌ను మట్టికరిపించారు. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచారు.

ఇప్పుడు మూడో వన్డే కోసం శ్రీలంక సన్నద్ధమైంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ లంక వశమౌతుంది. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో చివరిసారిగా 1997లో టీమిండియాను ఓడించింది శ్రీలంక. ఈ సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సిరీస్‌లో కూడా గెలవలేదు. చివరి 10 సిరీస్‌లల్లో ఓటమిపాలవుతూ వచ్చింది.
ఈ చెత్త రికార్డును చెరిపేసుకునే సువర్ణావకాశం లభించింది శ్రీలంకకు. ఈ రెండు జట్ల చివరిదైన మూడో వన్డే ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలని ప్రేమదాస స్టేడియంలో ఆరంభమౌతుంది. ఇందులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత్.. దీన్ని కైవసం చేసుకోవాలనే కసితో ఉంది శ్రీలంక.
రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ మ్యాచ్‌కు కేప్టెన్ రోహిత్ శర్మ దూరం అవుతాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వెన్నునొప్పి కారణంగా విరాట్ కోహ్లీ ఆడట్లేదనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమాచారం ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలంకతో రెండో వన్డేలో 241 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. అతను బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కుడి తొడ కండరాలు పట్టేశాయి. టీమ్ ఫిజియోథెరపిస్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఆ తరువాత రోహిత్ శర్మ బ్యాటింగ్ కొనసాగించాడు.
అక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ- తొడ కండరాలు పట్టేయడం వల్ల నొప్పితో రోహిత్ శర్మ నొప్పితో సతమతమౌతున్నాడని, మూడో వన్డేలో అతనికి విశ్రాంతి ఇవ్వడం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెట్ ప్రాక్టీస్‌లో సైతం పాల్గొనకపోవడాన్ని ఇందుకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తోన్నాయి.
రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేకపోతే అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ లేదా కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా అపాయింట్ చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. విరాట్ కోహ్లి కూడా కాస్త వెన్నునొప్పి కారణంగా ఆడడని కొందరు అంటున్నారు.
ఈ స్థితిలో మూడో వన్డేకు ముందు అతడు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదని, అందుకే మూడో వన్డేలో ఆడడం లేదని సోషల్ మీడియాలో సమాచారం వ్యాపిస్తోంది. అలాగే రోహిత్ శర్మ ఆడకపోతే అతని స్థానంలో సబ్‌మన్ గిల్ లేదా కేఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా తీసుకోవాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీటిని టీమిండియా మేనేజ్‌మెంట్ కొట్టిపడేసింది. తొడ కండరాలు పట్టేసిన మాట వాస్తవమేనని, అందువల్ల నెట్ ప్రాక్టీస్‌లో ఎక్కువ సేపు పాల్గొనలేదని తెలిపింది. ఆ సమయంలో ఇతర ప్లేయర్లకు విలువైన సూచనలు సలహాలు ఇచ్చాడని, పూర్తి ఎనర్జిటిక్‌గా ఉన్నాడని తేలిపోయింది.