Fact Check: టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?
Fact Check: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త దావానలంలా వ్యాపించింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు ప్రకటించిన భారత టీ20 జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడమే కాకుండా ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు కోల్పోవడంతో తీవ్ర నిరాశకు గురై సూర్య అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారనే వార్త నెటిజన్లను, క్రీడా ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎక్స్ వేదికగా సూర్యకుమార్ యాదవ్ పేరుతో ఓ పోస్ట్ విపరీతంగా షేర్ అయింది. ఆ పోస్ట్‌లో.. "ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం. నా అరంగేట్రం మ్యాచ్‌లో సిక్సర్ బాదడం నుంచి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడటం వరకు సాగిన ఈ ప్రయాణం ఎప్పటికీ మరచిపోలేనిది. నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. బీసీసీఐ, నా తోటి ఆటగాళ్లు, అభిమానులకు ధన్యవాదాలు. ఇకపై సరికొత్త అధ్యాయం వైపు అడుగులు వేస్తాను!" అని రాసి ఉంది. ఈ పోస్ట్ షేర్ చేసిన కేవలం రెండు గంటల్లోనే దాదాపు 3.50 లక్షల మందికి పైగా వీక్షించడంతో వైరల్‌గా మారింది.

అయితే ఈ రిటైర్మెంట్ వార్తలపై నిజానిజాలను పరిశీలిస్తే ఇదంతా కేవలం ఒక ఫేక్ వార్త అని తేలింది. సూర్యకుమార్ యాదవ్ అధికారికంగా ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పోస్ట్ సూర్యకుమార్ అసలు ఖాతా నుంచి వచ్చింది కాదు. అది ఒరిజినల్ అకౌంట్ కాదని నకిలీదని తేలింది. ఆ ఖాతా ప్రొఫైల్ పేరు సూర్యకుమార్ యాదవ్ లాగే ఉన్నప్పటికీ.. దాని హ్యాండిల్ పేరు మాత్రం '@unreal_sky' అని ఉంది. ఒక నకిలీ ఖాతా ద్వారా సృష్టించబడిన ఈ రిటైర్మెంట్ పోస్ట్‌ను నిజమని నమ్మి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
మరోవైపు ఫామ్ కోల్పోవడం వల్ల ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టి శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. జట్టు నుంచి తనను తొలగించడం, కెప్టెన్సీ మార్పుపై సూర్యకుమార్ యాదవ్ ముంబై టీ20 లీగ్ టాస్ సమయంలో చాలా పరిణతితో మాట్లాడాడు. తన స్థానంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. "శ్రేయస్ అయ్యర్ కోసం నేను చాలా సంతోషిస్తున్నాను. మేము ముంబై, భారత్ తరఫున కలిసి చాలా క్రికెట్ ఆడాము. అన్నింటికంటే ముఖ్యంగా ముంబై నుంచి భారత్‌కు వరుసగా ముగ్గురు టీ20 కెప్టెన్లు రావడం ముంబై క్రికెట్‌కు గర్వకారణం" అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి సూర్య రిటైర్మెంట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications