భారత మార్కెట్‌పై కన్నేసిన లాలిగా: క్రికెట్‌కు గట్టి పోటీ ఇస్తుందా?

హైదరాబాద్: భారత్‌లోని పుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. స్పెయిన్ వేదికగా జరిగే ప్రఖ్యాత ఫుట్‌బాల్ టోర్నీ లాలిగా 2019 సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు లా లీగా భారత్ ఎండీ జోస్ ఆంటోనియో తెలిపారు.

పుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో పుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీని భారత పుట్‌బాల్ ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ సీజన్‌లో మొత్తం లాలిగా 380 మ్యాచ్‌లను ఫేస్‌బుక్‌లో ఉచితంగాప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

అత్యాధునిక కెమెరాలు, సాంకేతికత సాయంతో
అత్యాధునిక కెమెరాలు, సాంకేతికత సాయంతో ఈసారి వినూత్నంగా టీవీల్లోనూ ప్రసారమయ్యే లాలిగా మ్యాచ్‌లు వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని ఆయన తెలిపారు. గత సీజన్‌లో లాలిగా టోర్నీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.7 బిలియన్ వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకున్నదని తెలిపారు.

ఫేస్‌బుక్‌తో మా భాగస్వామ్యం ఎంతో కీలకమైంది
"ఫేస్‌బుక్‌తో మా భాగస్వామ్యం ఎంతో కీలకమైంది. UEFA ర్యాంకింగ్స్‌లో వరుసగా ఏడేళ్ల పాటు అత్యుత్తమ లీగ్‌గా రేటింగ్ సొంతం చేసుకున్న లా లిగాను దేశంలోని అన్ని ప్రాంతాలలో ఎక్కువ మంది భారతీయులకు తీసుకెళ్లడానికి మేము వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని లా లీగా భారత్ ఎండీ జోస్ ఆంటోనియో తెలిపారు.

మరింతగా పెరగాలని
"ఇండియాలో లాలిగా టోర్నీని అనుసరించే వీక్షకుల సంఖ్య మరింతగా పెరగాలని మేము నిరంతరం పరిశోధనలు చేస్తున్నాం. టీవీలో క్రికెట్ 90 శాతం స్పేస్‌ను ఆక్రమిస్తే... ఆ తర్వాత భారత్‌లో ఫుట్‌బాల్‌నే టోవీల్లో ఫుట్‌బాల్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా కొనసాగుతోంది" అని ఆయన తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications